Home » Pinnelli Venkatarami Reddy
Buddha Venkanna: మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకటరామిరెడ్డి తమపై దాడికి ఉసిగొల్పారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు.తురక కిషోర్ తమపై దాడి చేసి చేసి చంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో పిన్నెల్లి సోదరులు, తురక కిషోర్‌లు ఎన్నో దారుణాలు చేశారని విమర్శించారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి శుక్రవారం రాత్రే విడుదల కావాల్సి ఉంది. అయితే.. పిన్నెల్లి రిలీజ్‌కు బ్రేక్ పడింది..
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ రెడ్డి (Jagan Reddy) నోరు తెరిస్తే అబద్దాల పుట్ట అని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య (Varla Ramaiah) వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. పిన్నెల్లిపై ఉన్న కేసుల విషయంలో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఇచ్చిన..
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై పోలీసులు రౌడీషీట్ తెరిచారు.
పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అరాచకాలు, అక్రమాలకు పాల్పడి, అల్లకల్లోలం సృష్టించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామిరెడ్డిపై మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం రౌడీషీట్ ఓపెన్ చేసినట్టు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చూసిన వైసీపీ నేతలు తెలంగాణకు మకాం మార్చారు. ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలు తెలంగాణ సరిహద్దులోని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో కృష్ణపట్టె గ్రామాలు, సమీప పట్టణాల్లో తిష్ఠవేశారు.
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఓట్ల లెక్కింపు సందర్భంగా మంగళవారం మాచర్ల నియోజకవర్గానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Election 2024) జరిగిన పోలింగ్ రోజు, ఆ తర్వాత మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy), ఆయన సోదరుడు సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు. పోలింగ్ కేంద్రాల్లో పిన్నెల్లి సోదరులు తెలుగుదేశం పార్టీ ఏజెంట్లపై హింసకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ పోలింగ్ ఏజెంట్ నోముల మాణిక్యాలరావు (Nomula Manikyala Rao) పిన్నెల్లి చేతిలో తీవ్రంగా గాయపడ్డారు.
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి ఎక్కడ? పోలింగ్ నాడు, మర్నాడు జరిగిన హింసాకాండలో ఆయన ప్రమేయం కూడా ఉంది.