Share News

Haryana Polls: హరియాణా బీజేపీ.. ముచ్చటగా మూడోసారికి, ఆ మూడే కీలకం

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:35 PM

మరికొన్ని గంటల్లో హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 5న ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ సహా పలు పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. అయితే అధికార బీజేపీపట్ల ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ వాటన్నింటినీ అధిగమించి మరోసారి మూడోసారి అధికారం చేపట్టాలని ఆ పార్టీ అహర్నిశలు శ్రమిస్తోంది.

Haryana Polls: హరియాణా బీజేపీ.. ముచ్చటగా మూడోసారికి, ఆ మూడే కీలకం

చండీగఢ్: మరికొన్ని గంటల్లో హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 5న ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ సహా పలు పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. అయితే అధికార బీజేపీపట్ల ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ వాటన్నింటినీ అధిగమించి మరోసారి మూడోసారి అధికారం చేపట్టాలని ఆ పార్టీ అహర్నిశలు శ్రమిస్తోంది. హరియాణా గ్రామీణ ప్రాంతంలోని ఓటర్లను ఆకర్షించడంతోపాటు, జాట్‌యేతర, దళిత ఓటర్లను సంఘటితం చేసేందుకు పావులు కదుపుతోంది. కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత కుమ్ములాటలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. హరియాణాలో కుల సమీకరణాలు, పార్టీల తగాదాలు ప్రధానాంశంగా మారాయి. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

దీనికితోడు ప్రస్తుతం బహుముఖ పోటీ జరగనున్న నేపథ్యంలో ఓట్ల చీలిక తమకు లాభిస్తుందని ఆ పార్టీ లెక్కలు వేసుకుంటోంది. 2014, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ చెరో 5 స్థానాలను గెలుచుకున్నాయి. హరియాణా రాష్ట్రం1966లో ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఇక్కడ ఏ పార్టీ కూడా వరుసగా మూడోసారి విజయం సాధించలేదు. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇందుకు మూడు అంశాలను పునాదులుగా మార్చుకుని పోరాటం చేస్తోంది. అవేంటంటే...


రంగంలోకి ఆర్ఎస్ఎస్..

హరియాణా గ్రామీణ ప్రాంతాల్లో పట్టు సాధించేందుకు బీజేపీ.. ఆర్ఎస్ఎస్‌ సహకారం తీసుకుంటోంది. ఇందుకోసం వ్యూహాత్మకంగా గ్రామీణ నియోజకవర్గాలపై దృష్టి సారించింది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 45 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకుంది. దీంతో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలినట్టైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పొరపాటు జరగకూడదని ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌లను రంగంలోకి దింపింది. ఇప్పటికే ప్రతి జిల్లాకు 150 మంది వాలంటీర్లను కేటాయించి గ్రామీణ ఓటరు ఔట్రీచ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ వాలంటీర్లు మండల కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నారు. వారు పంచాయతీ స్థాయి వాలంటీర్లతో 'చౌపల్స్' (గ్రామ సమావేశాలు) ద్వారా ఓటర్లకు చేరువయ్యే ప్రయత్నం చేస్తారు.


నాన్ జాట్, దళిత ఓటర్లపై దృష్టి...

దళితుల మధ్య విభజనను పసిగట్టి జాట్‌యేతర ఓటర్లను సంఘటితం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. సంఖ్యాపరంగా ప్రాబల్యం లేని కులాల కూటమి అయిన 36 మంది బిరాదారీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆ పార్టీ విజయం సాధిస్తే, కాంగ్రెస్‌కు ఓటు వేయాలనుకుంటున్న గ్రామీణ ఓటర్లపై తీవ్రంగా ప్రభావం పడుతుంది. మరోవైపు చీలిన దళిత ఓట్లను ఆకర్షించి కూడా లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోంది. ఈ అంశాలు తమకు గౌరవప్రదమైన సీట్లు తీసుకువస్తాయని భావిస్తోంది.36 బిరాదారీలతో కూడిన కులాలు, వర్గాలలో బ్రాహ్మణులు, బనియాలు (అగర్వాల్‌లు), జాట్‌లు, గుర్జర్‌లు, రాజ్‌పుత్‌లు, పంజాబీలు (హిందూ), సునార్‌లు, సైనీలు, అహిర్లు, సైనీలు, రోర్స్, కుమ్హర్‌లు ఉన్నారు.

కాంగ్రెస్‌ విభేదాలు కలిసొచ్చేనా..

అన్ని రాష్ట్రాల మాదిరిగానే హరియాణా కాంగ్రెస్‌లోనూ విభేదాలున్నాయి. దళిత నేత, ఎంపీ కుమారి సెల్జా, మరొకరు భూపిందర్ సింగ్ హుడా మధ్య పోరు కాంగ్రెస్‌ను రెండుగా చీల్చింది. ఇరువురి నేతల్ని ఏకం చేసేందుకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల ప్రయత్నించినప్పటికీ.. విభేదాలు మాత్రం తొలగలేదు. ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు విధేయుల్ని బరిలో దించడంతో ఆ పార్టీ ఓట్లకు భారీగా గండిపడే అవకాశం ఉంది. ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ చూస్తోంది.

Varanasi: ఆలయాల వద్ద ఉద్రిక్తత.. సాయిబాబా విగ్రహాల తొలగింపు

Viral News: చెత్తలో దొరికింది.. ఖరీదు రూ.55 కోట్లు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 02 , 2024 | 12:43 PM