Share News

Amit Shah: తెలంగాణలో అమిత్ షా పర్యటన అంతా గోప్యమే.. కంగుతిన్న కమలనాథులు!

ABN , Publish Date - Mar 12 , 2024 | 05:25 PM

Amit Shah Hyderabad Visit: కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) తెలంగాణ పర్యటన అంతా అత్యంత గోప్యంగా నడిచింది. షా ఎప్పుడు ఎక్కడ పర్యటిస్తారనే దానిపై సొంత పార్టీ నేతలకే క్లారిటీ లేని పరిస్థితి. మంగళవారం నాడు తెలంగాణకు వచ్చిన షా.. ముందుగా ఇచ్చిన షెడ్యూల్‌ను ఫాలో అవ్వలేదు.. మార్పులు, చేర్పులు జరుగుతూనే వచ్చాయి..

Amit Shah: తెలంగాణలో అమిత్ షా పర్యటన అంతా గోప్యమే.. కంగుతిన్న కమలనాథులు!

కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) తెలంగాణ పర్యటన అంతా అత్యంత గోప్యంగా నడిచింది. షా ఎప్పుడు ఎక్కడ పర్యటిస్తారనే దానిపై సొంత పార్టీ నేతలకే క్లారిటీ లేని పరిస్థితి. మంగళవారం నాడు తెలంగాణకు వచ్చిన షా.. ముందుగా ఇచ్చిన షెడ్యూల్‌ను ఫాలో అవ్వలేదు.. మార్పులు, చేర్పులు జరుగుతూనే వచ్చాయి. అమిత్ షా షెడ్యుల్, ఆయన రూట్స్‌ను అత్యంత గోప్యంగా పోలీసులు ఉంచుతున్నారు. సీఏఏ నోటిఫై తర్వాత అమిత్ షా మొదటి పర్యటన ఇదే కావడంతో అంతా గోప్యంగానే జరుగుతోందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. షా భద్రత విషయంలో తెలంగాణ పోలీసులు అత్యంత జాగ్రత్తగా వ్యహరిస్తున్నారు. మరోవైపు.. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ల రద్దు ఖాయమని అమిత్ షా పదే పదే చెబుతూ ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది.

Big Breaking: బీజేపీలోకి వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే..!



Amit-Shah-V.jpg

YS Jagan: ‘సిద్ధం’ చివరి సభలో జగన్ ప్రసంగం.. కంగుతిన్న వైసీపీ!

పర్యటన జరిగిందిలా..?

షా షెడ్యూల్‌లో సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్ నుంచి ఎల్బీ స్టేడియం వెళతారని ఉన్నపటికీ.. ఐటీసీ కాకతీయకు షా వెళ్లారు. అక్కడ్నుంచి ఎల్బీ స్టేడియంకు కేంద్ర మంత్రి వెళ్లారు. ఎల్బీ స్టేడియం సభ తర్వాత నేరుగా భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయానికి షా చేరుకున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలతో కలిసి అమ్మవారిని అమిత్ షా దర్శించుకున్నారు. అయితే.. కేంద్ర హోంశాఖ కార్యాలయం విడుదల చేసిన షెడ్యూల్‌లో అమిత్ షా భాగ్యలక్ష్మీ అమ్మవారి దర్శనం చేసుకుంటారన్న విషయం మాత్రం ఎక్కడా లేదు. దర్శనం అనంతరం నేరుగా బేగంపేట ఎయిర్‌పోర్టుకు షా బయల్దేరి వెళ్లారు. అక్కడ్నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఢిల్లీకి చేరుకుంటారు. మొత్తానికి చూస్తే.. షా షెడ్యూల్‌ విషయంలో రాష్ట్ర కమలనాథులు ఒకింత కంగారు పడ్డారని చెప్పుకోవచ్చు.

Amit-Shah-Parliament.jpg

Pawan Kalyan: ఢిల్లీ పర్యటనలో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పవన్ కల్యాణ్!

టార్గెట్ కోసం..!

అయితే.. ఈసారి హైదరాబాద్ పార్లమెంట్ సీటును కొట్టాలనే టార్గెట్‌ పెట్టుకోవడంతో పాతబస్తీకి షా వెళ్లారనే చర్చ కూడా నడుస్తోంది. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపీకి కంచుకోటగా ఉన్న హైదరాబాద్ లోక్‌సభ నుంచి బీజేపీ తరఫున మాధవీ లత పోటీచేస్తున్నారు. ఇదొక్కటే కాదు.. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే.. 12 స్థానాల్లో గెలవాలన్నదే బీజేపీ టార్గెట్ అని.. గెలిచి తీరుతామని ఎల్బీ స్టేడియం వేదికగా అమిత్ షా చెప్పుకొచ్చారు. తెలంగాణలో 12.. దేశంలో 400 ఎంపీ సీట్లు గెలవడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని షా స్పష్టం చేశారు. తెలంగాణకు గత పదేళ్లుగా 10వేల కోట్ల రూపాయిలు కేంద్రం సాయం చేసిందని.. కేంద్రం అమలు చేసే పథకాలను ప్రజలకు అర్ధమయ్యేలా వివరించాలని పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. షా పర్యటనలో సమావేశాలు, బహిరంగ సభల వరకూ ఓకేగానీ.. సడన్‌గా షెడ్యూల్ మార్పుతోనే కాస్త కన్ఫూజన్‌గా నడిచిందని చెప్పుకోవచ్చు.

Amit-Shah-At-Bhagya-lakshmi.jpg

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 12 , 2024 | 05:29 PM