Share News

Viral News: యూట్యూబర్ అవతారమెత్తిన ట్రక్ డ్రైవర్.. నెల సంపాదన తెలిస్తే షాకే..!

ABN , Publish Date - Aug 19 , 2024 | 03:44 PM

ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వీడియోలకు తెగ డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా యూట్యూబ్‌లో రకరకాల పేర్లతో ఛానెళ్లు ఓపెన్ చేసి వంట, ట్రావెలింగ్, ఫ్యాషన్ సహా పలు రకాల వీడియోలు పోస్టు చేస్తూ చాలా మంది సెలెబ్రిటీలుగా మారిపోయారు. అయితే తాజాగా ఓ ట్రక్ డ్రైవర్ కూడా యూట్యూబ్‌లో ఫేమస్ అయ్యారు. తనకున్న టాలెంట్‌తో నెలకు లక్షలు సంపాదిస్తూ ఔరా అనిపిస్తున్నారు. దీంతో ఆయన సంపాదన విషయం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

జార్ఖండ్‌ రాష్ట్రం జమ్తారాకు చెందిన రాజేశ్ రావణి అనే వ్యక్తి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆయన దాదాపు 25సంవత్సరాల నుంచి ఆ వృత్తిలో ఉన్నారు. ఐదుగురు ఉన్న ఆ కుటుంబంలో ఆయన ఒక్కరే సంపాదించేది. అయితే కరోనాకు ముందు ఆయన చాలీచాలని వేతనంతో కుటుంబాన్ని ఈడ్చుకుంటూ వచ్చారు. కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సి వచ్చేదని, అవి తీర్చేందుకు నానా పాట్లు పడాల్సి వచ్చేదని ఆయన చెప్పుకొచ్చారు. అయితే యూట్యూబ్ ఆలోచన తన కుటుంబ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చేసినట్లు రాజేశ్ ఓ పాడ్ కాస్ట్‌లో చెప్పుకొచ్చారు.

రాజేశ్ తన వృత్తిలో భాగంగా లారీలో దేశవ్యాప్తంగా తిరుగుతుంటారు. అందులో భాగంగా అతని దినచర్య గురించి వీడియోలు తీసేవారు. అయితే అతనికి మరో ఇష్టమైన పని కూడా ఉంది. అదే వంట చేయడం. లారీలో ఆయన సంచారం జీవితం గుడుపుతుండడం వల్ల సొంతంగా వంట చేసే వారు. వాటికి సంబంధించిన వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేవారు. వివిధ రకాల రుచులు ఎలా తయారు చేయాలో చెప్తూ ఆయన తీసిన వీడియోలకు పెద్ద మెుత్తంలో వ్యూస్ వచ్చేవి. ఏ వంటను ఏ విధంగా చేయాలో ఆయన చెప్పే విధానం ఆకట్టుకునేలా ఉండడంతో భారీగా సబ్‌స్ర్కైబర్లు పెరిగారు. ప్రస్తుతం ఆయన యూట్యూబ్ ఛానెల్‌కు 1.86మిలియన్లు ఉన్నారు.

రోజూ వంటలు చేస్తూ రాజేశ్ రావణి వీడియోలు తీసే వారు. అయితే తన ముఖాన్ని మాత్రం ఏ రోజూ చూపించలేదు. దీంతో ప్రేక్షకుల కోరిక మేరకు ఓ వీడియోను తన కుమారుడితో తీయించారు. అందులో ఆయన స్వయంగా కనిపిస్తూ ఓ వంటకానికి సంబంధించి వివరణ ఇచ్చారు. అది కాస్త వైరల్‌గా మారి ఆయనకు 1.86మిలియన్ల సబ్‌స్ర్కైబర్లను తెచ్చిపెట్టింది. దీంతో రాజేశ్ ఇక వెనుతిరిగి చూసుకోలేదు. ప్రతీ వీడియో లక్షల్లో వ్యూస్ వస్తుండడంతో ఆయన సంపాదన ఒక్కసారిగా పెరిగిపోయింది.

భారీగా వీక్షకులు ఆయన ఛానెల్ చూస్తుండడంతో రాజేశ్ ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. ఓ ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను ట్రక్ నడపడం వల్ల నెలకు రూ.25వేల నుంచి 30వేల వరకు సంపాదిస్తున్నట్లు చెప్పారు. అయితే యూట్యూబ్ ద్వారా నెలకు రూ.4లక్షల నుంచి 5లక్షల వరకు సంపాదిస్తున్నట్లు వెల్లడించారు. ఓ నెలలో అయితే ఏకంగా రూ.10లక్షలు వచ్చినట్లు చెప్పారు. అయితే ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. నెలకు అంత సంపాదిస్తున్నారా... శభాష్ అంటూ కొందరు, ఉన్నత చదువులు చదివినా మాకు అంత జీతం లేదే అంటూ మరికొందరూ, మేము ఉద్యోగాలు వదిలేసి ఇలాంటి వీడియోలు చేస్తామంటూ మరికొందరూ కామెంట్లు పెడుతున్నారు.

Updated Date - Aug 19 , 2024 | 05:02 PM