Viral News: సహాయం చేయడానికి సైతం గుండె ధైర్యం కావాల్సిందే.. నమ్మకం లేకుంటే ఈ వీడియో చూసేయండి..
ABN , Publish Date - Feb 21 , 2024 | 10:44 AM
ఎండలు మండిపోతున్నాయి. నీటి కష్టాలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. ఇక అడవుల్లో తిరిగే జంతువుల సంగతి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. నీటి కోసం మైళ్ల దూరం వెళ్తాయి. తిండీ తిప్పల కోసం వలస వెళ్తాయి.
ఎండలు మండిపోతున్నాయి. నీటి కష్టాలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. ఇక అడవుల్లో తిరిగే జంతువుల సంగతి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. నీటి కోసం మైళ్ల దూరం వెళ్తాయి. తిండీ తిప్పల కోసం వలస వెళ్తాయి. ఇక పాముల సంగతి కూడా ఇంచుమించు ఇదే. బొరియలు, పుట్టల్లో తలదాచుకునే సర్పాలు నీటి కోసం జనావాసాల్లోకి చేరుతున్నాయి. మనుషుల కంట పడి కొన్ని సార్లు ప్రాణాలు కూడా కోల్పోతున్నాయి. అయితే మధ్యప్రదేశ్ లో ఓ విచిత్ర ఘటన జరిగింది. ఓ రైతు తన ఇంట్లో ధాన్యం బస్తాలు నిల్వ చేశాడు. అవి కొన్ని రోజులుగా మూలన పడి ఉండటంతో అందులోకి ఓ పాము వచ్చి చేరింది. కొన్ని రోజుల తర్వాత సదరు రైతు.. బస్తాలు తీస్తున్న సమయంలో పామును గుర్తించాడు. అది బుసలు కొడుతూ బుస్సున పైకి లేచింది. దీంతో భయపడిపోయిన రైతు స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చాడు.
స్పాట్ కు చేరుకున్న స్నేక్ క్యాచర్ గోదాం వద్దకు చేరుకుని నాగుపామును రక్షించారు. ఆ సమయంలో పాము చాలా భయపడి, కంగారుగా ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే బాటిల్ లోని వాటర్ ను పాముకు తాగించాడు. ఈ దృశ్యాన్ని అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ గా మారింది. వీడియో చూసిన జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాటి ప్రాణి పట్ల మానవత్వం ఉన్నప్పటికీ.. అందుకు చాలా ధైర్యం కావాలని కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.