Trending: పరాయి దేశంలో లెహెంగాతో అదరగొట్టేసింది.. ఇండియన్స్ అంటే ఆ మాత్రం ఉంటది మరి..
ABN , Publish Date - Feb 13 , 2024 | 10:39 AM
సాంప్రదాయ వంటలు, దుస్తులకు భారత్ పెట్టింది పేరు. ధగ ధగ మెరిసే పట్టు చీరల నుంచి అధునాతన హంగులు సంతరించుకున్న లెహెంగాల వరకు ఎన్నో వెరైటీ గార్మెట్స్ కు ఇండియా కేరాఫ్ గా మారింది.
సాంప్రదాయ వంటలు, దుస్తులకు భారత్ పెట్టింది పేరు. ధగ ధగ మెరిసే పట్టు చీరల నుంచి అధునాతన హంగులు సంతరించుకున్న లెహెంగాల వరకు ఎన్నో వెరైటీ గార్మెట్స్ కు ఇండియా కేరాఫ్ గా మారింది. చీరకట్టుతో నిండైన భారతీయత ఉట్టిపడుతుంది. లంగా ఓణీ వేసుకుని హొయలు పోయే అమ్మాయిలకు మన దేశంలో కొదవే లేదు. ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా వివిధ రకాల దుస్తులు ధరిస్తుంటాం. విదేశాల్లో భిన్న పరిస్థితులు ఉంటాయి. అక్కడి పద్ధతులకు అనుగుణంగా వారు ఉంటారు. అయితే.. ఇంతటి సంప్రదాయం కలిగిన భారతీయులు వేసుకునే డిజైన్స్ అక్కడి వారిని అవాక్కయ్యేలా చేస్తాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ యువతి భారతీయ సంప్రదాయ దుస్తులైన లెహెంగాను వేసుకుంది. స్పానిష్-ఇండియన్ మూలానికి చెందిన మోడల్ అయిన శ్రద్ధ.. లెహెంగాలో లండన్ వీధుల్లో తిరుగుతున్న వీడియోను షేర్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఆమె వేసుకున్న డ్రెస్ చాలా మంది దృష్టిని ఆకర్షించింది. పింక్ కలర్ లెహంగా ధరించి భారీ ఆభరణాలు వేసుకుంది.
రైలు ప్లాట్ ఫాంపై, వీధుల్లో నడుస్తుంటే అందరూ ఆమె వైపే చూస్తున్నారు. చుట్టూ ఉన్న వారు వివిధ రకాల రియాక్షన్లు ఇవ్వడం, ఫొటోలు తీయడం వంటివి చేస్తున్నారు. ఫిబ్రవరి 1న ఈ వీడియోను పోస్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ క్లిప్ కు 44 మిలియన్ వ్యూస్, 2.7 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. అంతే కాకుండా వీడియో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను ఫన్నీగా కామెంట్ల రూపంలో రాస్తున్నారు.
మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.