Viral Video: అడవిలో ఎలుగుబంట్ల పోరాటం.. వీడియో చూస్తే భయంతో వణికిపోవాల్సిందే..
ABN , Publish Date - Mar 31 , 2024 | 01:21 PM
అడవిలో ఎన్నో రకాల జంతువులు ఉంటాయి. వాటిలో కొన్ని చాలా ప్రమాదకరమైనవి. పులి, సింహం, ఎలుగు బంట్లు ఈ కోవలోకే వస్తాయి. వాటి చేతికి చిక్కామో ఇక అంతే సంగతులు. అంతే కాకుండా ఈ జంతువులు మాంసాహారులు. ఆహారం కోసం చిన్న జంతువులను వేటాడాల్సిందే.
అడవిలో ఎన్నో రకాల జంతువులు ఉంటాయి. వాటిలో కొన్ని చాలా ప్రమాదకరమైనవి. పులి, సింహం, ఎలుగు బంట్లు ఈ కోవలోకే వస్తాయి. వాటి చేతికి చిక్కామో ఇక అంతే సంగతులు. అంతే కాకుండా ఈ జంతువులు మాంసాహారులు. ఆహారం కోసం చిన్న జంతువులను వేటాడాల్సిందే. చంపి ఆరగించాల్సిందే. అడవిలో జంతువుల వేట, కొట్లాటకు సంబంధించిన వీడియోలు మనం ఎన్నో చూశాం. వీటిని చూసినప్పుడల్లా అడవి పైకి కనిపించినంత ప్రశాంతంగా ఉండదు అనే విషయం అర్థమవుతుంది. ప్రస్తుతం రెండు ఎలుగుబంట్లు కొట్లాడుకుంటున్న వీడియో సోషల్ మీడియా ( Social media ) లో వైరల్ గా మారింది.
Himachal Pradesh: మండు వేసవిలో హిమపాతం.. మంచు దుప్పటి కప్పుకున్న హిమాలయ రాష్ట్రాలు..
ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో ఓ ఎలుగుబంటి తన దారిన తాను వెళ్తోంది. ఆ సమయంలో దానికి మరో ఎలుగుబంటి కనిపిస్తుంది. దాంతో మొదటి ఎలుగుబంటికి కోపం ముంచుకొస్తుంది. అంతే.. ఒక్క ఉదుటున రెండో ఎలుగుబంటిపై దాడి చేస్తుంది. రెండు భారీ ఎలుగుబంట్లు కోపంతో ఒకదానిపై మరొకటి దాడి చేసుకున్నాయి. భీకరంగా అరుస్తూ పై చేయి సాధించాలనే తాపత్రయంతో విధ్వంసానికి పాల్పడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది.
Trending News: ఈ దేశంలో అసలు నేరాలే జరగవట.. ఆయుధాలు ఉన్నా ఉపయోగించరట.. !
9 నిమిషాల నిడివి గల ఈ వీడియోకు ఇప్పటి వరకు తొమ్మిది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వేలాది మంది ఈ వీడియోను లైక్ చేసి, వివిధ రకాల రియాక్షన్‌లు ఇచ్చారు. ఎలుగుబంట్ల మధ్య ఇలాంటి పోరాటాన్ని తాము ఎప్పుడూ చూడలేదని ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.