Viral: ఆదివారాలు ఐపీఎల్ మ్యాచ్‌లు కూర్చుని చూసేందుకు కరెక్ట్ సోఫా ఇదే: ఆనంద్ మహీంద్రా
ABN , Publish Date - May 06 , 2024 | 09:41 PM
గోరిల్లా ఆకారంలో ఉన్న భారీ సోఫా ఫొటోను ఆనంద్ మహీంద్రా నెట్టింట పంచుకున్నారు. ఆదివారాలు ఐపీఎల్ మ్యాచులను ఈ సోఫాలో కూర్చునే చూడాలని చెప్పుకొచ్చారు. ఈ ట్వీ్ట్‌కు నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: తన ఫాలోవర్లతో స్ఫూర్తివంతమైన అంశాలతో పాటు ఎంటర్‌టైన్మెంట్ విషయాలు కూడా పంచుకోవడంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ముందుంటారు. అటు జ్ఞానం, ఇటు ఫన్ సమపాళ్లల్లో అందించాలని ఆయన నమ్ముతారేమో తెలీదు కానీ జనాలు మాత్రం మహీంద్రా పోస్టులకు పెద్ద ఎత్తున స్పందిస్తుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఓ సోఫా కూడా జనాలను అమితంగా ఆకర్షిస్తోంది (Viral).
ఇది గొరిల్లా ఆకారంలో భారీ సైజులో తయారు చేసిన సోఫా (Gorilla Shaped Sofa). ఆదివారాలు ఐపీఎల్ మ్యాచులు చూసేందుకు ఇదే అత్యంత అనువైన సోఫా అని ఆయన ట్వీట్ చేశారు. బాగా మెత్తగా ఉండేలా డిజైన్ చేసినట్టు ఉన్న ఈ సోఫా జనాలకూ బాగా నచ్చింది. దీంతో, జనాలు మహీంద్రా ట్వీట్‌కు పెద్ద ఎత్తున స్పందించారు. ఆనంద్ మహీంద్రా అభిప్రాయంతో ఏకీభవించారు. ఐపీఎల్ మ్యాచులను ఇలాంటి సోఫాల్లోనే కూర్చుని చూడాలని అధికశాతం మంది కామెంట్ చేశారు.
Viral: పెళ్లిలో ప్రమాదం.. వరుడిని కాపాడిన వధువు!
మరోవైపు, కొన్ని రోజుల క్రితం ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన కప్‌బోర్డు తరలింపు వీడియో కూడా ఇలాగే వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ఓ భారీ కప్‌బోర్డును లూనా లాంటి వాహనంపై కొందరు తరలించారు. తొలుత నలుగురు వ్యక్తులు కప్‌బోర్డును జాగ్రత్తగా తీసుకొచ్చి లూనాపై పెడితే మరో వ్యక్తి దాన్ని లూనా మీదే పెట్టుకుని తీసుకెళ్లిపోయాడు. 10 నిమిషాల్లో ఫుడ్, పచారీ సమాన్ల డెలివరీ చూశాం కానీ ఇది 10 నిమిషాల్లో ఫర్నీచర్ డెలివరీ అన్నమాట అంటూ ఆనంద్ మహీంద్రా కామెంట్ చేశారు. ఈ వీడియోకు కూడా ఆయన ఫాలోవర్ల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది.