Share News

Viral Video: సర్కస్‌లో షాకింగ్ సీన్.. విన్యాసాలు చేస్తుండగా.. ఈ ఎలుగు బంటి ఏం చేసిందంటే..

ABN , Publish Date - Jul 18 , 2024 | 06:50 PM

పులులు, సింహాలు, ఎలుబంట్లు వంటి జంతువులతో ఆటలు ఆడితే ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే కొందరు మాత్రం వీటితో కూడా గేమ్స్ ఆడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇక సర్కస్‌లలో అయితే...

Viral Video: సర్కస్‌లో షాకింగ్ సీన్.. విన్యాసాలు చేస్తుండగా.. ఈ ఎలుగు బంటి ఏం చేసిందంటే..

పులులు, సింహాలు, ఎలుబంట్లు వంటి జంతువులతో ఆటలు ఆడితే ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే కొందరు మాత్రం వీటితో కూడా గేమ్స్ ఆడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇక సర్కస్‌లలో అయితే వాటితో రకరకాల విన్యాసాలు కూడా చేయిస్తుంటారు. అయితే అన్ని రోజులు ఒకల ఉండవన్నట్లు.. కొన్నిసార్లు అంతటి అనుభవం ఉన్న వారికి కూడా షాకింగ్ అనుభవం ఎదురువుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. సర్కస్‌లో విన్యాసం చేస్తుండగా.. ఎలుగుబంటి రెచ్చిపోయిది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రష్యాలో (Russia) జరిగిన సర్కస్‌లో (circus) ఈ ఘటన చోటు చేసుకుంది. వాయువ్య రష్యన్ రిపబ్లిక్ ఆఫ్ కరేలియాలోని ఓలోనెట్స్‌లో ట్రావెలింగ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ జంతువలతో అనేక రకాల విన్యాసాలు చేయించారు. ఈ క్రమంలోనే వారు ఎలుగుబంటితో కూడా ఓ స్టంట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఓ ట్రాలీ బండిని ఎలుగుబంటి తోసుకుంటూ వెళ్లాలి. ఇందుకు తగ్గట్టుగానే శిక్షణ ఇచ్చిన ఎలుగుబంటిని రంగంలోకి దింపారు. వారు చెప్పినట్లుగానే ఎలుగుబంటి కూడా ట్రాలీ బండిని.. అచ్చం మనుషుల్లాగానే తోసుకుంటూ వెళ్లింది. వేదికపై ఒక వైపు నుంచి మరో వైపునకు తోసుకుంటూ వెళ్తింది.

Viral Video: పిచ్చి ముదిరితే ఇలాగే ఉంటుందేమో.. రీల్స్ చేస్తూ బైకర్‌కు షాకిచ్చిన యువతి.. చివరకు..


ఆ సమయంలో అక్కడే ఉన్న శిక్షకుడు దానికి సూచనలు ఇస్తున్నాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సూచనలు ఇచ్చే క్రమంలో ఎలుగుబంటికి సమీపంగా వచ్చిన శిక్షకుడు దాని మల్లించబోయాడు. దీంతో ఒక్కసారిగా (bear attacked the trainer) ఆగ్రహానికి గురైన ఎలుబంటి.. అతడిపై దాడికి దిగింది. కిందపడ్డ అతడిపై దాడి చేసి చేయి కొరకబోయింది. ఈ ఘటనతో సర్కస్ చూస్తున్న వారంతా షాక్ అయ్యారు. కొందరు భయంతో అక్కడి నుంచి పక్కకు పారిపోయారు. ఎలుగుబంటి దాడి చేయడాన్ని గమనించిన ఇంకో వ్యక్తి దాన్ని కాలితో తన్ని పక్కకు పంపించే ప్రయత్నం చేశాడు.

Viral Video: ఇలాంటి ఫైట్ ఎప్పుడూ చూసి ఉండరు.. పాము, ముంగిస మధ్య భీకర పోరు.. చివరకు..


ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. అదృష్టవశాత్తూ ఎలుగుబంటి శాంతించడంతో.. ఈ ఘటనలో శిక్షకుడికి ఎలాంటి గాయాలూ కానట్లు తెలిసింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో.. చూస్తుంటనే భయమేస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వర్షంలో రీల్ చేయాలని ఉత్సాహంగా వెళ్లాడు.. కెమెరా ఆన్ చేసి డాన్స్ చేస్తుండగా..

Updated Date - Jul 18 , 2024 | 06:50 PM