Viral Video: పరీక్ష కేంద్రంలో స్వయంగా సమాధానాలు చెబుతున్న టీచర్లు.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..
ABN , Publish Date - Jul 17 , 2024 | 06:57 PM
పరీక్షలంటేనే విద్యార్థులు తెగ భయపడిపోతుంటారు. ఈ క్రమంలో చాలా మంది విద్యార్థులు.. ఇన్విజిలేటర్లు, స్వ్కాడ్‌లకు దొరక్కుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయినా కొన్నిసార్లు వారికి దొరికిపోతుంటారు. అయితే మరికొన్నిసార్లు ..
పరీక్షలంటేనే విద్యార్థులు తెగ భయపడిపోతుంటారు. ఈ క్రమంలో చాలా మంది విద్యార్థులు.. ఇన్విజిలేటర్లు, స్వ్కాడ్‌లకు దొరక్కుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయినా కొన్నిసార్లు వారికి దొరికిపోతుంటారు. అయితే మరికొన్నిసార్లు విద్యార్థులకు అలాంటి భయం లేకుండా.. ఏకంగా టీచర్లే సమాధానాలు చెబుతుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పరీక్ష కేంద్రంలో స్వయంగా ఓ టీచర్ విద్యార్థులకు సమాధానాలు చెబుతున్నాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రాజస్థాన్ (Rajasthan) కొలు అనే గ్రామంలోని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ రాష్ట్రంలోని కొన్ని పాఠశాలల్లో 10, 12 విద్యార్థులకు స్టేట్ ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ (State Open School Exams) జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొలు గ్రామంలోని పాఠశాలలోనూ పరీక్షలు నిర్వహించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే ఊహించని ఘటన చోటు చేసుకుంది.
Viral Video: మేడపై ఇలాంటి పనులు చేస్తుంటే జాగ్రత్త.. గుండె ధైర్యం ఉన్న వాళ్లు మాత్రమే చూడండి..
పరీక్షలు రాయడంలో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఏకంగా టీచర్లే (Teachers) సమాధానాలు చెబుతున్నారు. బోర్లుపై సమాధానాలు రాసి మరీ సాయం చేశారు. అంతటితో ఆగని వారు.. సమాధానాలు చెప్పినందుకు గానూ.. విద్యార్థుల నుంచి రూ.1000, రూ.2000లు డబ్బులు కూడా తీసుకున్నారు. అయితే ఇలా కాపీలు (mass copying) జరుగుతుండగా విజిలెన్స్ స్క్వాడ్ (vigilance squad) అక్కడికి చేరుకుంది. పాఠశాలల వద్దకు చేరుకున్న కాసేపటికే వారికి అనుమానం కలిగింది. దీంతో చివరకు కెమెరా ఆన్ చేసి మరీ పరీక్ష కేంద్రంలోకి ఎంటర్ అయ్యారు.
Viral Video: ఇలాంటి ఫైట్ ఎప్పుడూ చూసి ఉండరు.. పాము, ముంగిస మధ్య భీకర పోరు.. చివరకు..
తరగతి గదిలోకి స్వ్కాడ్ రావడాన్ని చూడగానే బోర్డుపై సమాధానాలు రాస్తున్న టీచర్.. ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. మాస్ కాపీయింగ్‌కు సహరిస్తున్న టీచర్లు అందరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా కొందరు టీచర్లే పరీక్ష రాస్తూ విద్యార్థులకు సహకరిస్తుండడాన్ని చూసి అధికారులు అవాక్కయ్యారు. ఈ ఘటనపై రాజస్థాన్ విద్యాశాఖ అధికారులు స్పందించారు. సదరు టీచర్లను సస్పెండ్ చేసి, ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
Viral Video: చికెన్ షాపులో కోడి చివరి చూపులు.. తోటి కోడిని ముక్కలు చేయడాన్ని చూడగానే..