Share News

Viral Video: ఇదేంటీ.. చేపలు పట్టడం మరీ ఇంత ఈజీనా.. చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ABN , Publish Date - May 23 , 2024 | 05:02 PM

చేపలు పట్టడం కొందరికి వ‌ృత్తి అయితే.. మరికొందరికి హాబీ. కొందరు గాలం వేసి చేపలు పడితే.. మరికొందరు వల విసిరి చేపలు పట్టడం సర్వసాధారణం. అయితే కొన్నిసార్లు కొందరు చిత్రవిచిత్రంగా చేపలు పట్టడం చూస్తుంటాం. ఇలాంటి..

Viral Video: ఇదేంటీ.. చేపలు పట్టడం మరీ ఇంత ఈజీనా.. చూస్తే అవాక్కవ్వాల్సిందే..

చేపలు పట్టడం కొందరికి వ‌ృత్తి అయితే.. మరికొందరికి హాబీ. కొందరు గాలం వేసి చేపలు పడితే.. మరికొందరు వల విసిరి చేపలు పట్టడం సర్వసాధారణం. అయితే కొన్నిసార్లు కొందరు చిత్రవిచిత్రంగా చేపలు పట్టడం చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ బాలుడు చేపలు పట్టడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇదేంటీ.. చేపలు పట్టడం మరీ ఇంత ఈజీనా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ బాలుడు చేపలు పట్టే విధానం (fishing) చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఒంటి నిండా బురద రాసుకున్న బాలుడు.. చెరువు గట్టు మీద పడుకున్నాడు. తర్వాత తన చేతిలోని స్ట్రా లాంటి పైపును నీళ్లలో పెట్టి, నోటితో గాలి ఊదుతాడు. దీంతో నీటిలో బుడగలు వస్తుంటాయి. ఈ బుడగలను గమనించిన చేపలు ఒక్కొక్కటిగా అక్కడికి వస్తాయి. ఇంకేముందీ, అలా చేప రాగానే ఇలా చేత్తో చాకచక్యంగా పట్టేసుకుని గట్టుపై విసిరేస్తాడు.

Viral Video: ఏనుగు ఏంటీ.. ఇలా చేసిందేంటీ..! నిద్రలేచిన కుక్కను చూసి.. సడన్‌గా..


ఇలా పెద్ద పెద్ద చేపలను ఎంతో ఈజీగా పట్టేసుకుంటాడు. తనకు కావాల్సిన మేర చేపలను పట్టేసుకుని ఇంటికి తీసుకెళ్తాడు. ఈ విధంగా ఆ బాలుడు ఏమాత్రం శ్రమ లేకుండా కేవలం ఒక స్ట్రాతో చేపలను (Fishing with straw) పట్టేశాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ బాలుడు టాలెంట్.. మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇలా పట్టాలని తెలీక.. ఇన్నాళ్లూ చాలా కష్టపడ్డామే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 13 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. పచ్చి మామిడిని క్షణాల్లో పండుగా ఎలా మార్చాడంటే..

Updated Date - May 23 , 2024 | 05:13 PM