Share News

Viral Video: ముసుగు ధరించి వెళ్తున్న మహిళను వెంబడించిన ఎద్దు.. చివరకు ట్విస్ట్ ఏంటో తెలిస్తే..

ABN , Publish Date - May 21 , 2024 | 09:38 PM

ప్రస్తుత సోషల్ మీడియా ప్రపంచంలో టెక్నాలజీని వాడుకుని కొందరు, అతి తెలివితో ఇంకొందరు, వినూత్నంగా ఆలోచిస్తూ ఇంకొందరు ట్రెండింగ్‌గా మారుతున్నారు. ఈ క్రమంలో కొందరు చేసే పనులు నెటిజన్లకు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఈ తరహా...

Viral Video: ముసుగు ధరించి వెళ్తున్న మహిళను వెంబడించిన ఎద్దు.. చివరకు ట్విస్ట్ ఏంటో తెలిస్తే..

ప్రస్తుత సోషల్ మీడియా ప్రపంచంలో టెక్నాలజీని వాడుకుని కొందరు, అతి తెలివితో ఇంకొందరు, వినూత్నంగా ఆలోచిస్తూ ఇంకొందరు ట్రెండింగ్‌గా మారుతున్నారు. ఈ క్రమంలో కొందరు చేసే పనులు నెటిజన్లకు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ముసుగు ధరించిన ఓ మహిళ.. దుకాణానికి వెళ్తుండగా ఓ ఎద్దు వెబండించింది. దాన్నుంచి తప్పించుకనేందుకు ఆమె వేగంగా పరుగెత్తి దుకాణంలోకి దూరింది. చివరకు ట్విస్ట్ ఏంటో తెలుసుకుని అంతా తెగ నవ్వుకుంటున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ ముసుగు ధరించి దుకాణానికి వెళ్తుంటుంది. ఇంతలో ఆమె వెనుక నుంచి ఉన్నట్టుండి ఓ ఎద్దు తరుముకుంటూ వస్తుంది. సడన్‌గా వెనుక నుంచి ఎద్దు (bull chased woman) రావడాన్ని గమనించిన ఆమె.. భయంతో పరుగులు పెడుతుంది. దాన్నుంచి తప్పించుకునే క్రమంలో చివరకు దుకాణంలోకి వెళ్లిపోతుంది.

Viral Video: ఎండ వేడిని భరించలేని కుక్క.. యజమాని ఇంట్లోకి వెళ్లి ఏం చేసిందో చూడండి..


ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది. దుకాణ యజమాని లోపలి నుంచి ఓ పొడవాటి కర్రతో బయటికి వచ్చి.. ‘‘ఇంకోసారి ప్రాంక్ వీడియోలతో (Prank videos) మహిళలను ఇలా భయపెడితే తోలు తీస్తా’’.. అని అన్నట్లుగా కోపంగా వస్తాడు. అతన్ని చూసి ఎద్దు ఆకారంలోని ముసుగును ధరించిన యువకులు.. అక్కడి నుంచి పరుగందుకుంటారు.

Viral Video: ఈ పావురం దౌర్జన్యం మామూలుగా లేదుగా.. ఆకలి తీర్చుకోవడానికి అది చేసిన నిర్వాకం..


అంతవరకూ తనను వెంబడించింది.. ఎద్దు ముసుగు ధరించిన యువకులు అని తెలుసుకున్న మహిళ అవాక్కవుతుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అచ్చం ఎద్దులాగే చేశారు’’.. అంటూ కొందరు, ‘‘ఓరి మీ ప్రాంక్‌లు తగలెయ్య’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 60వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌‌లో విచిత్ర ఘటన.. నిద్ర లేచిన దంపతులు.. సీట్ల కింద పరిశీలించగా..

Updated Date - May 21 , 2024 | 09:39 PM