Share News

Viral: పెళ్లిలో ప్రమాదం.. వరుడిని కాపాడిన వధువు!

ABN , Publish Date - May 06 , 2024 | 09:05 PM

ఓ వివాహ వేడుక సందర్భంగా వధూవరులున్న స్టేజీ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ క్రమంలో వరుడు కిందపడబోతుండగా వధువు అతడు కింద పడకుండా అడ్డుకుంది.

Viral: పెళ్లిలో ప్రమాదం.. వరుడిని కాపాడిన వధువు!

ఇంటర్నెట్ డెస్క్: ఓ వివాహ వేడుక సందర్భంగా వధూవరులున్న స్టేజీ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ క్రమంలో వరుడు కిందపడబోతుండగా వధువు అతడు కింద పడకుండా అడ్డుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్‌లో ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్ (Viral) అవుతోంది.

వధూవరులతో ఫొటోలో దిగేందుకు బంధువులు పెద్ద ఎత్తున స్టేజీపైకి వచ్చారు. ఈ క్రమంలో స్టేజీ ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే, తన పక్కనే ఉన్న వరుడు కూడా కిందపడబోతుండగా వధువు అతడిని గట్టిగా పట్టుకుని ఆపింది. దీంతో, అతడికి ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో పలువురు గాయపడగా వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తు్న్నారు. పెళ్లి వేడుకకు హాజరైన వ్యక్తి ఒకరు ఘటనను కెమెరాలో బంధించి నెట్టింట షేర్ చేశారు. దీంతో, ఈ ఘటన స్థానికంగా పెద్ద కలకలానికే దారి తీసింది. అయితే, ప్రమాదం వెనక పూర్తి కారణాలు ఏమిటనేది ఇంకా తెలియరాలేదు (Bride Saves Groom As Stage Collapses At UP Wedding).

Viral: 27 ఏళ్ల కూతురు కొడుకని తెలిసి తల్లిదండ్రులకు షాక్! పెళ్లి కుదిరాక బయటపడ్డ సీక్రెట్!


కాగా, ఇటీవల జరిగిన మరో పెళ్లి వేడుకలో జరిగిన ఫన్నీ ఉదంతం తాలూకు వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో వధువు తొలుత వరుడికి వరమాల వేసింది. ఆ తరువాత వరుడు కూడా వరమాల వేయబోతుండగా వధువు బంధువులు ఆమెను వరుడికి అందనంత ఎత్తుకు ఎత్తుతారు. దీంతో, వరుడు అత్యుత్సాహానికి పోయి ఎగిరి మరీ ఆమె మెడలో దండ వేశాడు. ఈ క్రమంలో వధువుతో సహా ఆమెను ఎత్తుకున్న బంధువులు కూడా కింద పడ్డారు. దీంతో, పెళ్లికి వచ్చిన వారందరూ గొల్లున నవ్వారు.

Read Viral and Telugu News

Updated Date - May 06 , 2024 | 09:12 PM