Share News

Viral Video: ఎడ్ల సంతలో రిపోర్టర్ ఓవర్ యాక్షన్.. దున్నపోతు ఏం చేసిందంటే..

ABN , Publish Date - Jul 03 , 2024 | 12:05 PM

Viral Video: ఎడ్ల సంతలో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న ఓ యాకంర్‌కు ఎద్దు ఊహించని షాక్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతుండగా.. సడెన్‌గా దూసుకొచ్చి ఢీకొట్టింది. ఇందుకు సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? అనే వివరాలు ఓసారి చూద్దాం.

Viral Video: ఎడ్ల సంతలో రిపోర్టర్ ఓవర్ యాక్షన్.. దున్నపోతు ఏం చేసిందంటే..
Viral Video

Viral Video: ఎడ్ల సంతలో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న ఓ యాకంర్‌కు ఎద్దు ఊహించని షాక్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతుండగా.. సడెన్‌గా దూసుకొచ్చి ఢీకొట్టింది. ఇందుకు సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? అనే వివరాలు ఓసారి చూద్దాం.

వైరల్ వీడియోలోని ఘటన పాకిస్తాన్‌లో చోటు చేసుకుంది. ఆ దేశానికి చెందిన ఓ జర్నలిస్ట్.. ఆవుల ప్రదర్శన(ఎడ్ల సంత) సంతకు వెళ్లింది. అక్కడ ఎద్దుల ధరలకు సంబంధించిన వివరాలను వ్యాపారులను అడిగి తెలుసుకుంటోంది. అయితే, ఆమెతో మాట్లాడేందుకు ఎవరూ ఆసక్తి కనబరచలేదు. దీంతో మైక్ చేతపట్టిన రిపోర్టర్.. మీడియా కవరేజ్ ఇస్తూ వ్యాపారులు చర్చకు సిద్ధంగా లేరని, ఒక్కో ఎద్దు/ఆవు ధర రూ. 5 లక్షలకు తక్కువ అయితే లేదు అని చెప్పుకొచ్చింది. ఆవులు, వ్యాపారుల గురించి తనదైన శైలిలో వివరిస్తూ వచ్చింది.


ఇంతలో వెనుకవైపు నుంచి దూసుకొచ్చిన ఓ ఎద్దు ఆ రిపోర్టర్‌ను ఢీకొట్టింది. దీంతో బెదిరిపోయిన రిపోర్టర్.. భయంతో గట్టి గట్టిగా కేకలు వేసింది. కిందపడకుండా ఉండేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఎద్దు బలంగా ఢీకొనడంతో బొక్క బోర్లా పడింది. పక్కనే ఉన్న వ్యాపారులు ఆ ఎద్దును కట్టడి చేశారు. అనంతరం కింద పడిన రిపోర్టర్‌ను పైకి లేపారు. కేవలం ఈ సీన్ మాత్రమే ఉన్న వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది.


ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు రిపోర్టర్‌కు మద్ధతుగా నిలుస్తుంటే.. మరికొందరు ఎడ్ల సంతలో ఎకసెకాలు ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 1 మిలియన్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. అనేక మంది తమ స్పందనను కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ‘లైవ్‌లో ఇది షాకింగ్ పరిణామం. ఇంత ప్రమాదకరమైన పరిస్థితిలోనూ ధైర్యంగా నిలబడిన రిపోర్టర్‌కు వందనాలు. ఫీల్డ్‌లో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. భద్రతకు ప్రాధాన్య ఇవ్వాలి’ అని ఓ యూజర్ పేర్కొన్నారు. మరికొందరు కెమెరామెన్‌ టార్గెట్‌గా నెగిటీవ్ కామెంట్స్ చేశారు. ‘ఎప్పటిలాగే కెమెరామెన్ తప్పించుకున్నాడు. రిపోర్టర్‌ను కాపాడలేదు’ అంటూ కామెంట్స్ పెట్టారు.


Also Read:

నెల రోజులు కాకుండానే ఎదురుదాడి..

జగన్‌కు ఝలక్.. ఇక నో హై సెక్యూరిటీ జోన్‌!

తొలిసారి 80,000 క్లబ్‌లోకి సెన్సెక్స్.. మరోవైపు నిఫ్టీ కూడా

For More Trending News and Telugu News..

Updated Date - Jul 03 , 2024 | 12:05 PM