Share News

Viral Video: ఆ మూవీలో ఆఫర్ వచ్చిందని తల్లికి చెప్పిన యువకుడు.. ఆ తర్వాత..

ABN , Publish Date - Oct 29 , 2024 | 03:48 PM

అశ్విన్ ఉన్ని అనే కంటెంట్ క్రియేటర్ ఇటీవల తన తల్లితో కలిసి ఓ వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారి లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది. అశ్విన్ ఉన్ని తన రూమ్‌లో కూర్చొని తల్లిని తన వద్దకు రమ్మని పిలుస్తాడు.

Viral Video: ఆ మూవీలో ఆఫర్ వచ్చిందని తల్లికి చెప్పిన యువకుడు.. ఆ తర్వాత..

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా కొంత మంది యువత తమను అందరూ గుర్తించాలని వివిధ రకాల వీడియోలు తీసి తమ ఖాతాల్లో పోస్టు చేస్తుంటారు. వీధుల్లో ప్రాంక్ వీడియోలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తే, మరి కొంత మంది నవ్వుల పాలు అవుతుంటారు. అయితే పాపులారిటీ కోసం యువత చేసే పనులకు ప్రజలు వివిధ రకాలకు స్పందిస్తుంటారు. అలాగే అశ్విన్ ఉన్ని అనే కంటెంట్ క్రియేటర్ చేసిన ఓ వీడియో తాజాగా నెట్టింట వైరల్ అయ్యింది. అతను చెప్పిన విషయానికి అశ్విన్ తల్లి ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.


అశ్విన్ ఉన్ని అనే కంటెంట్ క్రియేటర్ ఇటీవల తన తల్లితో కలిసి ఓ వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారి లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది. అశ్విన్ ఉన్ని తన రూమ్‌లో కూర్చొని తల్లిని తన వద్దకు రమ్మని పిలుస్తాడు. ఆమె వచ్చిన తర్వాత వీడియో ముందున్న కుర్చీని తల్లికి ఇచ్చి తాను ఆమె వెనకాల నిల్చుంటాడు. అప్పుడు ఆమెకు ఓ విషయం చెబుతాడు. తనకు ఓ సినిమా ఆఫర్ వచ్చిందని అశ్విన్ తల్లికి చెబుతాడు. దీంతో ఆమె పట్టలేనంత సంతోషానికి గురవుతుంది. అనంతరం ఆమె నిజం చెప్పమని కోరుతుంది. దీంతో అతను నిజంగానే ఆఫర్ వచ్చిందని, రూ.3లక్షలు ఇస్తామని చెప్పారని తల్లికి చెబుతాడు.


దీంతో ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోతాయి. అయితే తనకు వచ్చింది సినిమా ఛాన్స్ కాదని, నీలి చిత్రాల్లో అవకాశమని చెబుతాడు. దీంతో అశ్విన్ తల్లి ఆశ్చర్యానికి గురవుతుంది. ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ నెటిజన్లను కట్టిపడేస్తోంది. అతడిపై ఒక్కసారి చిరాకు పడిన ఆమె "తల్లిదండ్రులతో ఎవరైనా ఇలాంటి విషయాలు చెప్తారా" అంటూ ప్రశ్నిస్తుంది. దీనికి యువకుడు తాను నటించడం లేదని, తనకు వచ్చిన ఆఫర్ గురించి మాత్రమే చెప్తున్నానని అంటాడు. అయినప్పటికీ ఆమె సరదాగా చిరాకు పడుతూ అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. అనంతరం తనకు వచ్చిన ఆఫర్ గురించిన మెసేజ్‌ను యువకుడు వీడియో చివర జత చేశాడు. దీంతో వీడియో పూర్తవుతుంది. ఈ వీడియోను అశ్విన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. ఇది కాస్త వైరల్‌గా మారి నెట్టింట చక్కర్లు కొడుతోంది.


అయితే ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. "తల్లితో ఎవరైనా ఇలాంటి జోకులు వేస్తారా?, నిజంగానే అలాంటి ఆఫర్ వచ్చిందా?, యువకుడి తల్లి నిజమైన భారతీయ తల్లిగా వ్యవహరించింది, అశ్విన్ నువ్వు ఆ ఆఫర్‌ని రిజక్ట్ చేసి నీ నిజాయితీ చాటుకున్నావు, ఆ ఆఫర్ వచ్చినప్పుడు మీ మెుదటి స్పందన ఏంటి?" అంటూ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Viral: గూగుల్‌ను కోర్టుకు ఈడ్చీ.. 2 బిలియన్ పౌండ్ల జరిమానా పడేలా చేసి..

Viral Video: కంటికి కనిపించేందంతా నిజం కాదంటే ఇదేనేమో.. ఈ చిన్నారి వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Updated Date - Oct 30 , 2024 | 01:56 PM