Share News

Viral Video: మొసలి దంతాలకు లెగ్ పీస్‌తో పరీక్ష.. నోటిలో పెట్టి బలంగా లాగడంతో చివరకు..

ABN , Publish Date - Sep 12 , 2024 | 05:34 PM

మొసలి దాడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారి వాటి నోటికి ఏదైనా జంతువు చిక్కిందంటే.. ఇక తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. వాటి దవడలు, దంతాలు అంత పవర్‌ఫుల్‌గా ఉంటాయి కాబ్టటే.. పెద్ద పెద్ద జంతువునలను సైతం అవలీలగా చంపేస్తుంటాయి. ఇలాంటి..

Viral Video: మొసలి దంతాలకు లెగ్ పీస్‌తో పరీక్ష.. నోటిలో పెట్టి బలంగా లాగడంతో చివరకు..

మొసలి దాడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారి వాటి నోటికి ఏదైనా జంతువు చిక్కిందంటే.. ఇక తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. వాటి దవడలు, దంతాలు అంత పవర్‌ఫుల్‌గా ఉంటాయి కాబ్టటే.. పెద్ద పెద్ద జంతువునలను సైతం అవలీలగా చంపేస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి మొసలి దంతాలకు పెద్ద పరీక్షే పెట్టాడు. లెగ్ పీస్‌ను మొసలి నోట్లో పెట్టి లాగడంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి చేతిలో పెద్ద లెగ్ పీస్‌తో మొసళ్ల చెరువులోకి వెళ్తాడు. అతను నీటిలోకి దిగగానే ఓ పెద్ద మొసలి అక్కడికి వస్తుంది. రోజూ ఆహారం పెడుతున్న ఆ వ్యక్తి కోసం ఆకలితో ఎదురు చూస్తున్న ఆ మొసలికి అతను పెద్ద పరీక్ష పెడతాడు. చేతిలోని లెగ్ పీస్‌ను తీసుకుని మొసలి నోట్లో పెడతాడు. అయితే మొసలి దంతాల పవర్ ఏంటో తెలుసుకునేందుకు దాన్ని బలంగా వెనక్కు లాగుతాడు.

Viral Video: అరే.. ఇలాంటి ఐడియాలు మనకెందుకు రాలేదూ.. ఒకే కనెక్షన్‌తో రెండు ఫ్యాన్లను..


లెగ్ పీస్‌ను పట్టుకున్న మొసలి.. ఒక్కసారిగా దాన్ని బలంగా నొక్కేస్తుంది. ‘‘నా నోటికి చిక్కాక వదులుతానా’’.. అని అన్నట్లుగా దాన్ని ఒక్కసారిగా (crocodile pulled off leg piece) బలంగా లాగేస్తుంది. దెబ్బకు అతను కూడా లెగ్ పీస్‌ను వదిలేయాల్సి వస్తుంది. లెగ్ పీస్‌ను లాగేసిన మొసలి.. దాన్ని చూస్తుండగానే గుటుక్కున మింగేస్తుంది. ఇలా మొసలి దంతాలకు లెగ్ పీస్‌తో ఇతను పెద్ద పరీక్షే పెడతాడు.

Viral Video: మహిళకు లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. కారులో ఛేజ్ చేసిన యువకులు.. చివరకు అసలు విషయం చెప్పడంతో..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘లెగ్ పీస్ తిన్న తర్వాత.. నీ లెగ్ తినకుండా చూసుకో బ్రదర్’’.. అంటూ కొందరు, ‘‘ఎంత ట్రైనింగ్ ఇచ్చినా మొసలితో జాగ్రత్తగా ఉండండి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 12 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: దున్నపోతును వేటాడిన సింహాలు.. తీరా తినే సమయంలో మొదలైన గొడవ.. చివరకు జరిగింది చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: పెళ్లిలో ఫొటోలు తీస్తుండగా షాకింగ్ సీన్.. వధువు తలపై ముద్దు పెట్టమంటే.. వరుడి వింత నిర్వాకం.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 12 , 2024 | 05:34 PM