Share News

Viral Video: మహిళకు లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. కారులో ఛేజ్ చేసిన యువకులు.. చివరకు అసలు విషయం చెప్పడంతో..

ABN , Publish Date - Sep 11 , 2024 | 08:40 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి బైకులో వెళ్తుండగా రోడ్డు పక్కన నిలబడ్డ ఓ మహిళ చేయి ఎత్తి ఆపుతుంది. బైకు ఆపగానే తాను అర్జంట్‌గా వెళ్లాలని, లిఫ్ట్ ఇవ్వమని కోరింది. దీంతో ఆ వ్యక్తి సదరు మహిళను బైకు ఎక్కించుకుని వెళ్లాడు. అయితే..

Viral Video: మహిళకు లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. కారులో ఛేజ్ చేసిన యువకులు.. చివరకు అసలు విషయం చెప్పడంతో..

ప్రస్తుతం దొంగతనాలు, దోపిడీలు సినిమా స్టైల్లో జరగడం చూస్తూనే ఉన్నాం. కొందరు ఎవరికీ అనుమానం రాకుండా నమ్మిస్తుంటారు. చివరకు తమ అసలు స్వరూపం బయటపెడుతుంటారు. మరికొందరు మహిళలు ఏవేవో మాటలు చెప్పి నమ్మించి మోసం చేయడం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి మహిళకు లిఫ్ట్ ఇచ్చి బైకులో ఎక్కించుకెళ్లడం చూసి కొందరు యువకులు కారులో ఛేజ్ చేసి మరీ ఆపేశారు. చఅయితే చివరకు వారు చెప్పింది విని ఆ బైకర్ ఖంగుతిన్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి బైకులో (Biker) వెళ్తుండగా రోడ్డు పక్కన నిలబడ్డ ఓ మహిళ (woman) చేయి ఎత్తి ఆపుతుంది. బైకు ఆపగానే తాను అర్జంట్‌గా వెళ్లాలని, లిఫ్ట్ (Lift) ఇవ్వమని కోరింది. దీంతో ఆ వ్యక్తి సదరు మహిళను బైకు ఎక్కించుకుని వెళ్లాడు. అయితే ఆమెను మొదటి నుంచీ గమనించిన కొందరు యువకులకు అనుమానం కలిగింది. దీంతో వెంటనే కారులో వెళ్లి బైకర్‌ను ఆపారు. ‘‘బైకు పక్కన ఆపండి’’.. అని గట్టిగా అరుస్తూ చెప్పారు.

Viral Video: బంగాళాదుంపల బాక్సు నుంచి వింత శబ్ధాలు.. కంగారుగా తెరచి చూడగా.. షాకింగ్ సీన్..


దీంతో సదరు వ్యక్తి బైకును రోడ్డు పక్కన ఆపేశాడు. కారు దిగి అక్కడికి వెళ్లిన యువకులు.. ‘‘నువ్వు లిఫ్ట్ ఇచ్చిన మహిళ ఓ దోపిడీ ముఠా సభ్యురాలు.. లిఫ్ట్ పేరుతో నిన్ను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దోచుకుంటారు. మిగతా ముఠా సభ్యులు వెనుక వాహనాల్లో వస్తున్నారు.. వెంటనే ఇక్కడి నుంచి పారిపో’’.. అని చెబుతారు. దీంతో ఆ వ్యక్తి భయంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. యువకులు అసలు విషయం చెప్పడంతో సదరు మహిళ షాక్ అవుతుంది. తానేమీ తప్పు చేయలేదు.. అన్నట్లుగా నటిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Viral Video: నదిలో సినిమాటిక్ రీల్ చేసేందుకు యువతి ప్రయత్నం.. అంతా బాగానే చేసింది కానీ.. చివర్లో..


ఇటీవల మహిళలు లిఫ్ట్ పేరుతో వాహనదాలను నిర్వానుష్య ప్రదేశానికి తీసుకెళ్లడం, అక్కడ సిద్ధంగా ఉన్న ముఠా సభ్యులు బెదిరించి డబ్బులు దోచుకెళ్లడం సర్వసాధారణమైంది. కాగా, ప్రస్తుతం చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. దోపిడీలు ఇలాక్కూడా చేస్తున్నారా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పెళ్లిలో ఫొటోలు తీస్తుండగా షాకింగ్ సీన్.. వధువు తలపై ముద్దు పెట్టమంటే.. వరుడి వింత నిర్వాకం.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: మొసలి ఆహారాన్ని లాక్కెళ్లిన డేగ.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. అవాక్కవుతారు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 11 , 2024 | 08:40 PM