Share News

Viral Video: ఆహా.. తెలివంటే నీదేనయ్యా.. పోలీసులకు దొరక్కుండా ఈ లారీ డ్రైవర్ వాడిన ట్రిక్ చూస్తే..

ABN , Publish Date - Nov 30 , 2024 | 11:07 AM

వాహనాల డ్రైవింగ్ సమయంలో కొందరు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. చాలా మంది పోలీసులకు దొరక్కుండా రకరకాల మార్గాలను అన్వేషిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు అతి తెలివిగా ఆలోచిస్తుంటారు. ఇలాంటి వారి నిర్వాకం చూస్తే పోలీసులు కూడా అవాక్కయ్యేలా ఉంటుంది. ఇలాంటి ..

Viral Video: ఆహా.. తెలివంటే నీదేనయ్యా.. పోలీసులకు దొరక్కుండా ఈ లారీ డ్రైవర్ వాడిన ట్రిక్ చూస్తే..

వాహనాల డ్రైవింగ్ సమయంలో కొందరు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. చాలా మంది పోలీసులకు దొరక్కుండా రకరకాల మార్గాలను అన్వేషిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు అతి తెలివిగా ఆలోచిస్తుంటారు. ఇలాంటి వారి నిర్వాకం చూస్తే పోలీసులు కూడా అవాక్కయ్యేలా ఉంటుంది. ఇలాంటి వినూత్న ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైలర్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ లారీ డ్రైవర్ పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు ఓ ట్రిక్ వాడాడు. అతడిద తెలివి చూసి చివరకు పోలీసులే అవాక్కయ్యారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ఆహా.. తెలివంటే నీదేనయ్యా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ లారీ డ్రైవర్ (Lorry driver) అతి తెలివి చూసి వాహనదారులు, పోలీసులు అవాక్కయ్యారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన సమయాల్లో సీసీ కెమెరాల్లో లారీ నంబర్ కనిపించకుండా ఉండేందుకు విచిత్రంగా ఆలోచించాడు. నంబర్ ప్లేటుపై (Number plate) కొన్ని నంబర్లు కనిపించకుండా వాటిపై గ్రీజు పూసేశాడు.

Viral Video: కారుకు పెట్రోల్ కొట్టిన మహిళకు ఊహించని షాక్.. డబ్బుల కోసం ముందు డోరు వద్దకు వెళ్లగా..


గ్రీజు పూయడం వల్ల (driver applying grease on number plate) కెమెరాల్లో తన వాహనం నంబర్ కనిపించకుండా అతి తెలివిగా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ వాహనాన్ని ఆపిన పోలీసులు.. నంబర్ ప్లేటు చూసి అవాక్కయ్యారు. పోలీసులను చూసి ఖంగుతిన్న లారీ డ్రైవర్.. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఏవేవో సాకులు చెప్పడం స్టార్ట్ చేశాడు. ఫైనల్‌గా సదరు పోలీసు.. అతన్ని నంబర్ ప్లేటు వద్దకు తీసుకెళ్లి, గ్రీజును శుభ్రం చేయించాడు.

Viral Video: డేగ పవర్ మామూలుగా లేదుగా.. వంద కిలోల జంతువును ఆకాశంలోకి ఎత్తుకెళ్లి.. చివరకు ఏం చేసిందో చూస్తే..


Lorry-driver-videos.jpg

నంబర్ కనిపించకుండా చేయడంతో పాటూ లైసెన్స్ కూడా లేకపోవడంతో పోలీసులు అతడికి జరిమానా విధించారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ డ్రైవర్ తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఎన్నాళ్ల నుంచి మనసులో పెట్టుకుందో.. వధువుకు స్వాగతం పలికిన వరుడి పరిస్థితి చివరకు..

Updated Date - Nov 30 , 2024 | 11:07 AM