Viral Video: డేగ పవర్ మామూలుగా లేదుగా.. వంద కిలోల జంతువును ఆకాశంలోకి ఎత్తుకెళ్లి.. చివరకు ఏం చేసిందో చూస్తే..
ABN , Publish Date - Nov 30 , 2024 | 08:56 AM
గద్దలు, డేగలు, రాబందుల వేటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. మనుషులపై దాడి చేయడానికి ప్రయత్నించిన డేగలను చూశాం. అలాగే ఆకాశంలో విహరిస్తూ నేలపై ఉన్న చిన్న చిన్న జీవులను కూడా ఇట్టే పసిగట్టి దాడి చేసే వాటిని కూడా చూస్తుంటాం. ఇలాంటి..
గద్దలు, డేగలు, రాబందుల వేటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. మనుషులపై దాడి చేయడానికి ప్రయత్నించిన డేగలను చూశాం. అలాగే ఆకాశంలో విహరిస్తూ నేలపై ఉన్న చిన్న చిన్న జీవులను కూడా ఇట్టే పసిగట్టి దాడి చేసే వాటిని కూడా చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ డేగ వేట చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. వంద కిలోల జంతువులను కూడా ఆకాశంలోకి ఎత్తుకెళ్లి చివరికి ఏం చేసిందో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకాశంలో విహరిస్తున్న ఓ డేగ.. ఆహారం కోసం సెర్చ్ చేస్తుంటుంది. ఇంతలో దానికి కొండలో సుమారు వంద కిలోల బరువు ఉండే జంతువు కనిపిస్తుంది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన టార్గెట్‌ను ఫిక్స్ చేస్తుంది. జంతువును చూడగానే క్షణాల (eagle attacking an animal) వ్యవధిలో దానిపై దాడి చేస్తుంది. కొండ పైన ఉన్న జంతువుపై దాడి చేసిన డేగ... ముందుగా దాన్ని కాళి గోర్లతో రక్కుతూ కిందకు తోసుకుంటూ వస్తుంది.
Viral Video: బ్యాడ్ టైం అంటే ఇదే.. తేమ తగలకుండా రోడ్డు దాటాలని చూస్తే.. చివరకు..
డేగ దాడి నుంచి తప్పించుకోవాలని ఆ జంతువు విశ్వ ప్రయత్నాలు చేసింది. అయినా ఆ డేగ మాత్రం జంతువును వదలకుండా కాళి గోర్లతో గట్టిగా పట్టుకుని కొండ కింద వరకూ లాక్కుంటూ వెళ్లింది. చివరకు అంత బరువున్న జంతువును సైతం ఎంతో అవలీలగా గాల్లోకి తీసుకెళ్తుంది. చాలా దూరం వరకూ దాన్ని అలాగే తీసుకెళ్లి.. చివరకు ఉన్నట్టుండి పైనుంచి కిందకు వదిలేస్తుంది. దీంతో ఆ జంతువు అంతెత్తు నుంచి ఒక్కసారిగా ధబేల్‌మని కిందపడి చనిపోతుంది. ఇదంతా దూరంగా గమనిస్తున్న డేగ.. ఆ తర్వాత తాపీగా దాని వద్దకు ఎగురుకుంటూ వెళ్లి తినేస్తుంది.
Viral Video: ఇలాంటి నిర్మాణం ఎక్కడైనా చూశారా.. ఇంజినీర్ ఎవరో గానీ సన్మానం చేయాల్సిందే..
ఈ ఘటన మొత్తం దూరంగా ఉన్న వారు తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ డేగ పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘జంతువును చంపేందుకే ఆకాశం నుంచి అలా విసిరేస్తుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.93 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఎన్నాళ్ల నుంచి మనసులో పెట్టుకుందో.. వధువుకు స్వాగతం పలికిన వరుడి పరిస్థితి చివరకు..
ఇవి కూడా చదవండి..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..