Share News

Crocodile: నడిరోడ్డుపై మొసలి.. ఎక్కడంటే..?

ABN , Publish Date - Jul 01 , 2024 | 03:22 PM

రత్నగిరి జిల్లా చిప్లున్ పట్టణంలో గల చిన్‌చాక ప్రాంతంలో ఆదివారం రాత్రి ఓ మొసలి రోడ్డు మీదకు వచ్చింది. ఆ మొసలి ఎనిమిది అడుగులు ఉంది. మొసలి రోడ్డు మీద పాకుతుండగా ఆటో రిక్షా నడిపే వ్యక్తి వీడియో తీశాడు.

Crocodile: నడిరోడ్డుపై మొసలి.. ఎక్కడంటే..?
Crocodile

రత్నగిరి: కాస్త ఆలస్యమైనా సరే వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వర్ష బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలతో చెరువులు/ నదుల్లోకి భారీగా వర్షపు నీరు చేరుతోంది. ఆ క్రమంలో నదుల్లో ఉన్న మొసళ్లు బయటకు వస్తున్నాయి. రోడ్డు మీదకు రావడంతో జనం భయాందోళన చెందుతున్నారు. మహారాష్ట్ర రత్నగిరిలో ఓ మొసలి రోడ్డు మీదకు వచ్చింది. ఆ ఘటనను ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది తెగ వైరల్ అవుతోంది.


రోడ్డు మీదకు మొసలి..

రత్నగిరి జిల్లా చిప్లున్ పట్టణంలో గల చిన్‌చాక ప్రాంతంలో ఆదివారం రాత్రి ఓ మొసలి రోడ్డు మీదకు వచ్చింది. ఆ మొసలి ఎనిమిది అడుగులు ఉంది. మొసలి రోడ్డు మీద పాకుతుండగా ఆటో రిక్షా నడిపే వ్యక్తి వీడియో తీశాడు. ఆ మొసలి వైపు లైట్ పెట్టి మరి వీడియో తీశారు. రోడ్డు మీద మొసలి నడిచే సమయంలో రోడ్డు మీద ఇతర వాహనాలు కూడా కనిపించాయి.


నది నుంచి..

పక్కనే శివ నది ఉందని, అక్కడి నుంచి మొసలి కొట్టుకొచ్చిందని స్థానికులు చెబుతున్నారు. భారీ వర్షం వల్ల మొసలి నది నుంచి రోడ్డు మీదకు వచ్చిందని వివరించారు. గతంలో కూడా ఇలా మొసళ్లు రోడ్ల మీదకు వచ్చిన ఘటనలు మనం చూశాం. విశ్వమిత్రి నది నుంచి వడోదర రోడ్డు మీదకు ఓ మొసలి వచ్చింది. ఆ మొసలి అయితే ఏకంగా 12 అడుగుల పొడవు ఉంది. ఆ మొసలిని అటవీశాఖ అధికారులు నదిలో వదిలి పెట్టారు.

Updated Date - Jul 01 , 2024 | 03:23 PM