Share News

Viral Video: పార్టీలో పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేశాడు.. చివరకు చూస్తే ఇలా బుక్కయ్యాడు..

ABN , Publish Date - Jan 13 , 2024 | 11:36 AM

రోజురోజుకూ పబ్బులు, పార్టీల కల్చర్ పెరిగిపోతోంది. కొత్తసంవత్సర వేడులు, పుట్టిన రోజులు, పెళ్లిరోజులు, పండుగలు, వీకెండ్స్.. ఇలా సందర్భం వస్తే చాలు వెంటనే పార్టీలు చేసుకునేందుకు యువత ఆసక్తిచూపుతున్నారు. ఇది కొన్నిసార్లు...

Viral Video: పార్టీలో పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేశాడు.. చివరకు చూస్తే ఇలా బుక్కయ్యాడు..

రోజురోజుకూ పబ్బులు, పార్టీల కల్చర్ పెరిగిపోతోంది. కొత్తసంవత్సర వేడులు, పుట్టిన రోజులు, పెళ్లిరోజులు, పండుగలు, వీకెండ్స్.. ఇలా సందర్భం వస్తే చాలు వెంటనే పార్టీలు చేసుకునేందుకు యువత ఆసక్తిచూపుతున్నారు. ఇది కొన్నిసార్లు శ్రుతిమించిపోతోంది. ఇలాంటి పనులు కొన్నిసార్లు ప్రాణాల మీదకూ వచ్చి పడుతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి పార్టీలో పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేశాడు. అయితే చివరకు ఎలా ఇరుక్కుపోయాడో చూసి.. నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇంగ్లండ్ (England) బర్మింగ్‌హామ్‌లోని ఓ హోటల్లో ఓ వ్యక్తి తన బంధువులు, స్నేహితులు, సన్నిహితులకు (Liquor party) పెద్ద పార్టీ ఇచ్చాడు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులంతా మందు తాగి ఎంజాయ్ చేశారు. అయితే ఈ క్రమంలో ఓ వ్యక్తి ఫుల్‌గా మందు కొట్టి చిందులేశాడు. ఒళ్లు తెలీకుండా తాగేయడంతో ఏం చేస్తున్నాడో అతడికే అర్థం కాలేదు. మద్యం మత్తులో డాన్సులు వేస్తూ చివరకు ఊహించని విధంగా ఓ పెద్ద కుండీలో (man stuck in big pot) పడిపోయాడు. దీంతో అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అందులో ఇరుక్కున్న అతను బయటికి వచ్చేందుకు ఎంతో శ్రమించాడు.

Viral Video: శుభమా అంటూ కొత్త రైలు కదులుతుండగా.. ఇంజిన్ ఎదురుగా వచ్చిన యువతి.. ఆమె నిర్వాకానికి అవాక్కైన డ్రైవర్లు..

అయినా ఆ కుండీ నుంచి బయటికి రావడం అతడికి సాధ్యం కాలేదు. చుట్టూ ఉన్న వారంతా అక్కడ గుమికూడి ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేశారు. కొందరు అతడి పరిస్థితిని చూసి తెగ నవ్వుకున్నారు. ఇంకొందరు అయ్యో పాపం!.. అనుకుంటూ ఎలాగోలా బయటికి తీసే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు చివరకు అతన్ని సురక్షితంగా కుండీని నుంచి బయటకు లాగేశారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడి ఎంజాయ్‌మెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘మందు బాగా పని చేసింది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం జనవరి 8న షేర్ చేసిన ఈ వీడియో.. ప్రస్తుతం 15 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఎవర్రా దీనికి ట్రైనింగ్ ఇచ్చిందీ... ఒలంపిక్స్‌కి పంపిస్తే గోల్డ్ మెడల్ ఖాయం..

Updated Date - Jan 13 , 2024 | 11:36 AM