Viral Video: బాధపడుతున్న పిల్లాడిని గమనించిన కుక్క పిల్ల.. సమీపానికి వెళ్లి మరీ సర్‌ప్రైజ్ చేసిందిలా..
ABN , Publish Date - Jan 12 , 2024 | 07:26 PM
సాటి మనుషుల పట్ల కనీసం మానవత్వం చూపించడానికి చాలా మందికి మనసు రాదు. ఇలాంటి నేటి సమాజంలో మనుషుల కంటే జంతువులు ఎంతో నయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులోనూ...
సాటి మనుషుల పట్ల కనీసం మానవత్వం చూపించడానికి చాలా మందికి మనసు రాదు. ఇలాంటి నేటి సమాజంలో మనుషుల కంటే జంతువులు ఎంతో నయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులోనూ మనుషుల పట్ల కుక్కలు ఎంత విశ్వాసంగా ఉంటాయో అందరికీ తెలుసు. ఒక్క ముద్ద అన్నం పెడితే చాలు.. జీవితాంతం వారి పట్ల విశ్వాసం చూపుతుంటాయి. అందుకే వాటిని విశ్వాసానికి మారుపేరుగా పిలుస్తుంటారు. ఇలాంటి కుక్కలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. బాధపడుతున్న పిల్లాడిని గమనించిన కుక్క పిల్ల.. సమీపానికి వెళ్లి ఏం చేసిందో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పిల్లాడు (boy) రోడ్డు పక్క దుకాణాల ముందు కూర్చుని బాధపడుతుంటాడు. అతడి వెనుకే నిలబడి ఉన్న కుక్క పిల్ల (Puppy) చాలా సేపు బాలుడిని గమనిస్తుంది. అటూ ఇటూ తిరిగి అతడిని గమనిస్తుంది. అయినా పిల్లాడు తల పైకి ఎత్తకుండా ఏడుస్తుండడాన్ని చూసి చలించిపోతుంది. ‘‘అరే!.. మా బాస్‌కు ఏమైందీ.. ఇలా వున్నాడే’’.. అని అనుకుంటూ దగ్గరికి వెళ్తుంది. అతన్ని ఓదార్చుతున్నట్లుగా తల దగ్గరగా పెట్టి దిగాలుగా ఉంటుంది. కుక్క పిల్ల బాధను అర్థం చేసుకున్న బాలుడు.. తల పైకి ఎత్తి దాన్ని గట్టిగా కౌగిలించుకుంటాడు. అప్పుడు కుక్క పిల్ల కూడా ఎంతో ఖుషీ అవుతుంది.
కాసేపటి తర్వాత.. ‘‘పదా.. త్వరగా ఇంటికి వెళ్దాం’’.. అన్నట్లుగా పిల్లాడికి సూచిస్తుంది. దీంతో బాలుడు కుక్క పిల్లపను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ ఘటనను మొత్తం ఎదురుగా కారులో కూర్చున్న వ్యక్తి వీడియో తీశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘హృదయానికి అత్తుకునే దృశ్యం’’.. అంటూ కొందరు, ‘‘మనుషులకంటే కుక్కలు ఎంతో మేలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఎవర్రా దీనికి ట్రైనింగ్ ఇచ్చిందీ... ఒలంపిక్స్‌కి పంపిస్తే గోల్డ్ మెడల్ ఖాయం..