Viral Video: కదులుతున్న కారు నుంచి ఆకస్మాత్తుగా మంటలు.. భారీగా ట్రాఫిక్ జాం..
ABN , Publish Date - Dec 09 , 2024 | 03:57 PM
రోడ్డుపై ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వంతెనపైనే కారు ముందు భాగం దాదాపు పూర్తిగా కాలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ముంబైలోని జోగేశ్వరి వంతెనపై ప్రముఖ BMW కంపెనీకి చెందిన కారు నుంచి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో డ్రైవర్ సహా పలువురు కిందకు దిగి దూరంగా వెళ్లారు. కానీ మంటలను ఆర్పేందుకు ఎవరూ కూడా ప్రయత్నించలేదు. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడి, ఆ ప్రాంతంలో భారీగా పొగ వ్యాపించింది. ఆ కారు రోడ్డు మధ్యలో ఆగిపోవడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆ కారు నంబర్ MH02 JP9955. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రమాదానికి కారణాలు ఏంటి..
మధ్యాహ్నం 1:15 గంటలకు అగ్నిప్రమాదం గురించి తమకు ఫోన్ వచ్చిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఆ క్రమంలో వెంటనే అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకుని మధ్యాహ్నం 2 గంటలకు మంటలను ఆర్పివేసినట్లు వెల్లడించారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు. కారులో ఏదైనా బ్లాస్ట్ అయ్యిందా లేదా ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనే వివరాలు తెలియాల్సి ఉంది.
కారు నుంచి మంటలేందుకు వస్తాయ్
మరోవైపు ఇలాంటి ఆకస్మిక ఘటనల వెనుక చాలా కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇంధనం లీకేజీ, టైర్ పేలడం, విద్యుత్ వైఫల్యం, యాక్సిడెంట్ సంభవించినప్పుడు కారు నుంచి మంటలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కారణం ఏదైనా కావచ్చు. కానీ కదులుతున్న కారులో మంటలు చెలరేగడం ప్రమాదకరమని అంటున్నారు. ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే, మంటలను ఆర్పివేయాలి, లేదా కారు నుంచి దూరంగా వెళ్లాలి. ఈ క్రమంలో కదులుతున్న కారులో మంటలు చెలరేగడం వంటి సంఘటనల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
మంటలు వస్తే ఏం చేయాలంటే..
ఒకవేళ మీ కారులో కూడా మంటలు చెలరేగితే మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి తగిన సమాచారం మీరు తెలుసుకుని ఉండాలి. దీంతో పాటు మీరు అగ్నిమాపక పరికరాలను కూడా కలిగి ఉండాలి. ఈ క్రమంలో మీ కారులో అకస్మాత్తుగా మంటలు సంభవించినప్పుడు మీరు ఈ క్రింది నియమాలను పాటించండి.
కారును ఆపివేసి, ఇగ్నిషన్ ఆఫ్ చేయండి
ఆ తర్వాత కారు నుంచి దిగండి
కాలిపోతున్న కారు నుంచి దూరం వెళ్లండి
మంటలను ఆర్పే యంత్రంతో మంటలను ఆర్పివేయండి
కారు బానెట్‌ను ఎట్టిపరిస్థితుల్లో తెరవవద్దు
వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించండి
ఇవి కూడా చదవండి:
Fake Apps: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఫేక్ యాప్‌లను ఇలా గుర్తించి, తొలగించుకోండి..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..
Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Read More National News and Latest Telugu News