Share News

Viral Video: సముద్రంలో కొట్టుకుపోతున్న వృద్ధుడు.. దూరం నుంచి గమనించిన మత్య్సకారుడు.. చివరికి..

ABN , Publish Date - Oct 17 , 2024 | 12:46 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ 60 ఏళ్ల వృద్ధుడు తన భార్యతో కలిసి బీచ్‌కు వచ్చాడు. అయితే అక్కడ వృద్ధుడు ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు అలల తాకిడికి కొట్టుకుపోయాడు. చూస్తుండగానే సముద్రం లోపలికి వెళ్లిపోయాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: సముద్రంలో కొట్టుకుపోతున్న వృద్ధుడు.. దూరం నుంచి గమనించిన మత్య్సకారుడు.. చివరికి..

‘‘దైవం మానుష రూపేణ’’.. అంటే దైవం మనిషి రూపంలో మన వెన్నంటే ఉన్నాడని అర్థం. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు.. ఈ మాట అక్షర సత్యం అని అనిపిస్తుంటుంది. ఇలాంటి ఘటనలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. సముద్రంలో కొట్టుకుపోతున్న ఓ వృద్ధుడిని మత్స్యకారుడు గమనించాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన దక్షిణ గోవాలోని (South Goa) పనాజీ బీచ్ వద్ద మంగళవారం చోటు చేసుకుంది. రష్యన్‌కు చెందిన ఓ 60 ఏళ్ల వృద్ధుడు (Russian old man) తన భార్యతో కలిసి బీచ్‌కు వచ్చాడు. అయితే అక్కడ వృద్ధుడు ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు అలల తాకిడికి కొట్టుకుపోయాడు. చూస్తుండగానే సముద్రం లోపలికి వెళ్లిపోయాడు. దీంతో చుట్టు పక్కల వారంతా గట్టిగా కేకలు వేశారు.

Viral Video: ఎక్కడమే కాదు.. దిగడం కూడా తెలియాలి.. ఇతడేం చేశాడో చూడండి..


అయితే అదే సమయంలో అక్కడే ఉన్న పీలే ఓ మత్స్యకారుడు గమనించాడు. వెంటనే స్పీడ్ బోటులో సముద్రంలోకి వెళ్లాడు. వృద్ధుడి సమీపానికి వెళ్లి, ఎట్టకేలకు అతన్ని సురక్షింతగా బయటికి లాగి బోటుపై ఎక్కించుకున్నాడు. చివరకు అతన్ని (Fisherman saved an old man who was drowning in the sea) క్షేమంగా ఒడ్డుకు చేర్చాడు. తన ప్రాణాలను కాపాడిన మత్స్యకారుడికి సదరు వృద్ధుడు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ సందర్భంగా పీలే మాట్లాడుతూ పర్యాటకులను తాను గౌరవిస్తానని, వారికి ఎలాంటి సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని తెలిపారు.

Viral Video: కుక్క దగ్గర కోతి చేష్టలు.. ఈ కాకి వేషాలు మామూలుగా లేవుగా..


సదరు మత్స్యకారుడు.. 2024 ఫిబ్రవరిలో బీచ్‌కు వచ్చిన UK మాజీ ప్రధాని రిషి సునక్ భార్య అక్షతా మూర్తిని కలిశాడు. అప్పట్లో ఆ వీడియో తెగ వైరల్ అయింది. అదేవిధంగా క్రికెట్ లెజెండ్ అయిన సచిన టెండూల్కర్‌ను ఈ మత్స్యకారుడు జెట్ స్కీ రైడ్‌కు కూడా తీసుకెళ్లాడు. కాగా, ప్రస్తుతం వృద్ధుడిని కాపాడిన పీలే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వృద్ధుడి పాలిట దేవుడిలా వచ్చాడు’’.. అంటూ కొందరు, ‘‘సమాజంలో ఇలాంటి వాళ్లు చాలా అరుదుగా కనిపిస్తుంటారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కదులుతున్న లారీలో ఇదేం పని.. ఇతడు చేసిన విన్యాసం చూస్తే షాకవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 17 , 2024 | 12:46 PM