Share News

Driving in Rain: వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

ABN , Publish Date - Aug 20 , 2024 | 09:52 PM

Safe Driving Tips: వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రజలు ఒక విషయంలో చాలా భయపడిపోతుంటారు. అదే సీజనల్ వ్యాధులు. ఈ సీజన్‌లో ప్రజలు రకరకాల వ్యాధులకు గురవుతుంటారు. ఇది సాధారణ సమస్య అయితే.. మరో పెద్ద సమస్య కూడా ఉంది. అదే రోడ్డు ప్రమాదాలు. ప్రతి సంవత్సరం దాదాపు 75 శాతం..

Driving in Rain: వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
Safe Driving Tips

Safe Driving Tips: వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రజలు ఒక విషయంలో చాలా భయపడిపోతుంటారు. అదే సీజనల్ వ్యాధులు. ఈ సీజన్‌లో ప్రజలు రకరకాల వ్యాధులకు గురవుతుంటారు. ఇది సాధారణ సమస్య అయితే.. మరో పెద్ద సమస్య కూడా ఉంది. అదే రోడ్డు ప్రమాదాలు. ప్రతి సంవత్సరం దాదాపు 75 శాతం రోడ్డు ప్రమాదాలు వాతావరణ కారణంగానే జరుగుతున్నాయని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. ఇందులో 47 శాతం ప్రమాదాలు వర్షపాతం సమయంలో జరుగుతున్నాయట. తక్కువ కాంతి, వర్షంలో రోడ్డు జారుడు తత్వం కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి వర్షంలో డ్రైవింగ్ చేయడం చాలా కష్టంతో కూడిన పని. కార్లు సహా పెద్ద పెద్ద వాహనాలు నడిపే వారు విండ్ షీల్డ్ సమస్యలు, లైటింగ్ సమస్యలు, ఇతరత్రా సమస్యలు ఎదుర్కొంటుంటారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సంగా కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో వర్షంలో డ్రైవింగ్ చేసే వారు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు నిపుణులు కొన్ని జాగ్రత్తలను సూచిస్తున్నారు. వాటిని పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలకు గురవకుండా ఉండొచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


1. వాతారణం మెరుగుపడే వరకు ఎదురు చూడాలి..

మీరు బయటకు వెళ్లాలనుకున్నప్పుడు వర్షం పడితే కాస్త ఆగడం ఉత్తమం. అత్యవసరం లేకపోతే.. వర్షం ఆగిపోయే వరకు ఎదురు చూసి ఆ తరువాత బయలుదేరాలి. తద్వారా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండొచ్చు.


2. మీ వాహనాన్ని తనిఖీ చేసుకోవాలి..

వర్షంలో డ్రైవింగ్ చేయాల్సి వస్తే.. ముందుగా మీ వాహనం హెడ్ లైట్స్, టెయిల్ లైట్స్, విండ్ షీల్డ్ వైపర్స్ సరిగా పని చేస్తున్నాయా? లేదా? అనేది చెక్ చేసుకోవాలి. అలాగే టైర్లలో తగినంత గాలి ఉందో లేదో కూడా చూసుకోవాలి. అరిగిపోయిన, గాలి తక్కువగా ఉన్నట్లయితే.. సరి చేసుకోవడం ఉత్తమం. లేదంటే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది.


3. వేగం వద్దు.. నిదానమే ప్రధానం..

వర్షం కురుస్తున్న సమయంలో మీ వాహనాన్ని వేగంగా నడపొద్దు. వర్షం పడుతున్న సమయంలో సాధారణం కంటే నిదానంగా నడపాలి. రోడ్డుపై నీటి కారణంగా బ్రేక్స్ వేస్తే వెంటనే ఆగిపోయే పరిస్థితి ఉండదు. అతి స్పీడ్ కారణంగా హైడ్రోప్లానింగ్ ఏర్పడి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే వర్షంలో నిదానంగా వెళ్లడం ఉత్తమం.


4. విండ్‌షీల్డ్ వైపర్‌లను ఉపయోగించాలి..

వాహనం విండ్‌షీల్డ్ వైపర్‌లను ఉపయోగించాలి. వర్షపు నీరు అద్దాలను బ్లా్క్ చేయకుండా విండ్ షీల్డ్ ఆన్ చేసి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.

5. హెడ్‌లైట్‌లను ఆన్ చేయాలి..

భారీ వర్షం కురుస్తున్నట్లయితే హెడ్‌లైట్ కూడా ఆన్ చేయాలి. వర్షంలో హెడ్‌లైట్స్ వేయడం వలన రహదారి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే.. ఎదురుగా వచ్చే వాహనదారులకు మీ వాహనం కనిపిస్తుంది.

6. ఇతర వాహనాలకు దూరంగా ఉండాలి..

వర్షం కురుస్తున్న సమయంలో గానీ.. రోడ్డు తడిగా ఉన్నా.. వాహన ప్రతిచర్య ఎక్కువగా ఉంటుంది. బ్రేక్ వేసినా వెంటనే అదుపులోకి రాదు. అందుకే.. మీ వాహనం, ముందుగా ఉన్న వాహనానికి దూరం పాటించడం ఉత్తమం. తద్వారా మీ ప్రయాణం కూడా సేఫ్‌గా ఉంటుంది.


7. సడెన్ బ్రేక్స్ వేయొద్దు..

వర్షంలో నెమ్మదిగా, క్రమంగా బ్రేక్ వేయాలి. అలా కాకుండా సడన్ బేక్స్ వేయొద్దు. మీరు మీ వాహనాన్ని ఆపాలనుకుంటే ముందుగా వాహనాన్ని స్లో చేయాలి. నిదానంగా బ్రేక్స్ వేయాలి. తద్వారా వాహనం కూడా సులభంగా కంట్రోల్ అవుతుంది. అలా కాకుండా సడన్‌ బ్రేక్ వేస్తే.. వాహనం అదుపు తప్పే అవకాశం ఉంటుంది.

8. నీరు ఉన్న చోట జాగ్రత్త..

నీరు నిల్వ ఉన్న రహదారిపై జాగ్రత్తగా వాహనం నడపాలి. లేదంటే హైడ్రోప్లానింగ్ ఏర్పడి ప్రమాదం జరిగే అవకాశం అధికంగా ఉంటుంది. టైర్లు ట్రాక్షన్ కోల్పోయినప్పుడు హైడ్రోప్లానింగ్ ఏర్పడుతుంది. అంటే.. కారు రోడ్డు ఉపరితలంపై కాకుండా నీటి ఉపరితలంపై నడుస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. ఇలాంటి పరిస్థితి ఉంటే వాహనాన్ని నెమ్మదిగా నడపాలి.


9. హైడ్రోప్లేన్ చేస్తే గ్యాస్‌ను వదిలేయండి..

హైడ్రోప్లానింగ్ కారు ప్రమాదాలకు అత్యంత సాధారణ కారణాలలో ఒకటి. హైడ్రోప్లానింగ్ కారణంగా వాహనం నియంత్రణ కోల్పోతుంది. హైడ్రోప్లేన్‌ ఏర్పడినట్లయితే.. డ్రైవింగ్ ప్రశాంతంగా చేయాలి. నిదానంగా గ్యాస్ పెడల్ నుంచి పాదాలను తీసేయాలి. వెళ్లాలనుకునే దారిలోకి వాహనాన్ని మళ్లించాలి. ముఖ్యంగా ఆకస్మిక మలుపులు ఉన్న చోట సడన్ బ్రేక్స్ వేయొద్దు. ఇలా చేస్తే వాహనం నియంత్రణ కోల్పోయి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.

10. తేమను తగ్గించాలి..

వర్షం పడుతున్నప్పుడు కారులో తేమ పెరుగుతుంది. వాహనం అద్దాలన్నీ పొగమంచు ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో డీఫ్రాస్టర్‌ని ఉపయోగించాలి. తద్వారా పొగమంచు తగ్గిపోతుంది.

For More Special News and Telugu News..

Updated Date - Aug 20 , 2024 | 10:08 PM