Share News

Viral Video: దుస్తులు వేసుకుంటుండగా బాలికకు షాకింగ్ అనుభవం.. ఆస్పత్రిలో వైద్యులు స్కానింగ్ చేసి చూడగా..

ABN , Publish Date - May 29 , 2024 | 08:26 PM

వైద్యుల వద్దకు కొన్నిసార్లు చిత్రవిచిత్ర కేసులు వస్తుంటాయి. కడుపునొప్పితే ఆస్పత్రికి వచ్చిన వారికి స్కానింగ్ చేసి చూస్తే.. లోపల ఇనుప ముక్కలు కనిపిస్తాయి. అలాగే చెవి నొప్పితో వచ్చిన వారిని పరిశీలిస్తే.. లోపల ఏకంగా పాములే కనిపిస్తాయి. ఇలాంటి..

Viral Video: దుస్తులు వేసుకుంటుండగా బాలికకు షాకింగ్ అనుభవం.. ఆస్పత్రిలో వైద్యులు స్కానింగ్ చేసి చూడగా..

వైద్యుల వద్దకు కొన్నిసార్లు చిత్రవిచిత్ర కేసులు వస్తుంటాయి. కడుపునొప్పితే ఆస్పత్రికి వచ్చిన వారికి స్కానింగ్ చేసి చూస్తే.. లోపల ఇనుప ముక్కలు కనిపిస్తాయి. అలాగే చెవి నొప్పితో వచ్చిన వారిని పరిశీలిస్తే.. లోపల ఏకంగా పాములే కనిపిస్తాయి. ఇలాంటి చిత్రవిచిత్రం ఘటనలకు సంబంధించిన వార్తలు, ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ బాలికకు దుస్తులు వేసుకుంటుండగా విచిత్ర అనుభవం ఎదురైంది. చివరకు ఆస్పత్రిలో వైద్యులు స్కానింగ్ చేసి లోపల ఉన్న వస్తువును చూసి షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. తమిళనాడులోని (Tamil Nadu) తంజావూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలికకు ఇటీవల షాకింగ్ అనుభవం ఎదురైంది. ఇటీవల ఓ రోజు బాలిక దుస్తులు వేసుకుంటుండగా.. పొరపాటున 1.5 అంగుళాల (girl swallowed the needle) సూదిని మింగేసింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయగా.. వారు కంగారుగా ఆస్పత్రికి తీసుకెళ్లారు.

Viral Video: రోడ్డుపై చిన్నాపిల్లల్లా ఆడుకుంటున్న మొసలి.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


వైద్యులు బాలికకు స్నానింగ్ చేసి.. లోపల ఉన్న సూదిని చూసి షాక్ అయ్యారు. బాలిక ఉపిరితిత్తుల్లో సూది నిలువుగానే ఉండడంతో ఎలాంటి గాయాలూ కాలేదు. అయితే ఎలాంటి శస్త్ర చికిత్స చేయకుండా సూదిని బయటికి తీసేందుకు వైద్యులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం వైద్యులు బ్రోంకోస్కోపీ టెక్నాలజీని (Bronchoscopy technology) ఆశ్రయించారు. ఈ టెక్నాలజీ సాయంతో కేవలం మూడున్నర నిముషాల వ్యవధిలో సూదిని విజయవంతంగా తొలగించారు.

Optical Illusion: మీకో ఛాలెంజ్.. ఈ స్క్రూలలో దాక్కుని ఉన్న స్ప్రింగ్‌ని 20 సెకన్లలో గుర్తించగలరా..


ఈ ఘటనను వైద్యులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వైద్యులు చాలా గొప్ప పని చేశారు’’.., ‘‘అందుకే వైద్యో.. నారాయణో హరి.. అని అన్నారు పెద్దలు’’.., ‘‘అంత పెద్ద సూదిని ఆపరేషన్ లేకుండా తీయడం గ్రేట్’’.., ‘‘ఇలాంటి వైద్యుల గురించి ఎంత చెప్పినా తక్కువే’’.., ‘‘వైద్యులకు మా సెల్యూట్’’.. అంటూ ఇలా నెటిజన్లు సదరు వైద్యులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Viral Video: నదిలో కొట్టుకుపోతున్న బాలుడు.. చనిపోయాడనుకున్న దశలో ఎలా బ్రతికించారో చూడండి..

Updated Date - May 29 , 2024 | 09:24 PM