Share News

Viral Video: వయసు మూడేళ్లే అయినా.. ఇతడు చేసిన పని చూస్తే.. అభినందించకుండా ఉండలేరు..

ABN , Publish Date - Aug 06 , 2024 | 08:14 AM

చాలా మంది పిల్లలు పెద్ద పెద్ద పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం చూస్తుంటాం. కొందరు పెద్దవాళ్లకు కనువిప్పు కలిగించే పనులు చేస్తుంటే.. మరికొందరు పిల్లలు ప్రమాదంలో పడిన వారిని కాపాడుతూ అందరితో శభాష్ అనిపించుకుంటుంటారు. ఇలాంటి ..

Viral Video: వయసు మూడేళ్లే అయినా.. ఇతడు చేసిన పని చూస్తే.. అభినందించకుండా ఉండలేరు..

చాలా మంది పిల్లలు పెద్ద పెద్ద పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం చూస్తుంటాం. కొందరు పెద్దవాళ్లకు కనువిప్పు కలిగించే పనులు చేస్తుంటే.. మరికొందరు పిల్లలు ప్రమాదంలో పడిన వారిని కాపాడుతూ అందరితో శభాష్ అనిపించుకుంటుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మూడేళ్ల వయసున్న ఓ పిల్లాడు చేసిన పనికి అంతా అతన్ని అభినందనలతో ముంచెత్తుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వృద్ధురాలు (old woman) తన ఇంట్లో నిచ్చెన వేసుకుని ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. అయితే ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. అటూ, ఇటూ కదిలే క్రమంలో పొరపాటున (ladder fell down) నిచ్చెన కిందపడిపోతుంది. దీంతో ఆమె అలాగే సీలింగ్‌ పట్టుకుని వేలాడుతూ ఉంటుంది.

Viral Video: ఆకలితో ఉన్న మొసళ్లు ఇలాక్కూడా చేస్తాయా.. గూస్‌బమ్స్ తెప్పిస్తున్న వీడియో..


అయితే అదే సమయంలో అక్కడే ఆడుకుంటున్న ఆమె మూడేళ్ల మనువడు గమనించి పరుగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. పడిపోయిన నిచ్చెనను అతికష్టం మీద పైకి లేపుతాడు. చివరకు దాన్ని వాళ్ల నానమ్మ కాళ్ల దగ్గరికి అందేలా నిలబెడతాడు. ఇలా సీలింగ్‌కు వేలాడుతున్న వృద్ధురాలు.. (grandson helped the grandmother) తన మనువడి సాయంతో సురక్షితంగా కిందకు దిగుతుంది. తన మనువడి చేసిన సాయానికి ముచ్చటపడిపోయిన ఆమె.. కిందకు దిగగానే నేరుగా వెళ్లి తన మనువడికి ముద్దు పెడుతుంది.

Viral: పట్టుకునే క్రమంలో కాటేసింది.. చికిత్స తీసుకుని వచ్చి కోబ్రాను చూడగా.. షాకింగ్ సీన్..


ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ బుడ్డోడు ఎంతో గొప్ప పని చేశాడు’’.. అంటూ కొందరు, ‘‘ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ఇలా పెంచాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 29వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: చూస్తుండగానే మాయమైన రోడ్డు.. దడ పుట్టిస్తున్న 52 సెకన్ల వీడియో..

Updated Date - Aug 06 , 2024 | 08:14 AM