Viral video: వధువు ఎదుటే వరుడితో ఆటలు.. చిర్రెత్తుకొచ్చిన పెళ్లికొడుకు చివరకు..
ABN , Publish Date - Jun 12 , 2024 | 09:07 PM
ప్రస్తుతం ఎక్కడ ఏ వివాహ కార్యక్రమం జరిగినా.. అందులో ఏదో ఒక సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. కళ్యాణ మంటపంలోకి వధూవరుల ఎంట్రీ దగ్గర నుంచి ..
ప్రస్తుతం ఎక్కడ ఏ వివాహ కార్యక్రమం జరిగినా.. అందులో ఏదో ఒక సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. కళ్యాణ మంటపంలోకి వధూవరుల ఎంట్రీ దగ్గర నుంచి కార్యక్రమం ముగిసేలోపు ఏదో ఒక విచిత్ర ఘటన మాత్రం విధిగా జరుగుతుంటుంది. కొందరు వ్యూస్ కోసం కావాలనే ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. మొత్తానికి పెళ్లికి సంబంధించి ఎలాంటి వీడియో అయినా నెటిజన్లు తెగ ఆకట్టుకుంటుంది. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి వధువు ఎదుటే వరుడితో ఆటలు ఆడాడు. అవి చివరకు శ్రుతిమించడంతో వరుడికి కోపం కట్టలుతెంచుకుంది. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో వధూవరులు దండలు మార్చుకుని వేదికపై ఏర్పాటు చేసిన కుర్చీల్లో కూర్చుని ఉంటారు. ఈ క్రమంలో బంధువులంతా వారికి బహుమతులు ఇస్తూ ఫొటోలు దిగుతుంటారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. వరుడి వెనుక వైపు నిల్చున్న వ్యక్తి.. వరుడికి డబ్బులు ఇస్తూ ఫొటో దిగుతుంటాడు. అయితే అందరిలాగే ఫొటో దిగి వెళ్లికుండా.. అతను ఓవర్ చేస్తాడు.
Viral video: చిరుతనే బురిడీ కొట్టించిన కుక్క.. ప్రాణాలు పోయే సమయంలో ఎలాంటి ప్లాన్ వేసిందో చూస్తే..
పెళ్లి కొడుకు తలపాగాను అటూ ఇటూ తిప్పుతూ తమాషా చేస్తాడు. తర్వాత అతడి తలపాగాను తీస్తూ, పెడుతూ పిచ్చి పిచ్చి పనులు చేస్తాడు. దీంతో అప్పటికే వరుడికి సహనం నశిస్తుంది. అయినా అలాగే భరించి కూర్చుని ఉంటాడు. అంతటితో ఆగని ఆ వ్యక్తి వరుడి చేతిలో కరెన్సీ నోటు పెట్టి, తర్వాత అతడి చెంపలపై చేతులు పెట్టి గట్టిగా లాగుతాడు. దీంతో అప్పటిదాకా భరించిన వరుడు ఒక్కసారిగా చెలరేగిపోతాడు. కుర్చీ నుంచి పైకి లేచి (Groom attack on relative) అతడిపై దాడికి దిగుతాడు. అతను కూడా వరుడిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తాడు.
Viral video: నిర్మానుష్యమైన బీచ్‌లో చిక్కుకుపోయిన వ్యక్తి.. గుళకరాళ్ల సాయంతో ఎలా బయటపడ్డాడంటే..
ఈ గొడవతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తవాతావరణం నెలకొంటుంది. పక్కన ఉన్న వారు పరుగెత్తుకుంటూ వచ్చి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. వధువు కూడా ముందు షాక్ అయినా.. తర్వాత వరుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అల్లరికంటూ ఓ హద్దు ఉంటుంది’’.. అంటూ కొందరు, ‘‘వరుడి సహనానికి పరీక్ష పెట్టాడే’’.. అంటూ మరికొందరు, ‘‘ఇదంతా వ్యూస్ కోసం కావాలని చేసినట్లు ఉంది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral video: అప్పగింతల సమయంలో అందరికీ షాక్ ఇచ్చిన వధువు.. చివరకు చుట్టూ అంతా చేరి..