Share News

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

ABN , Publish Date - Oct 12 , 2024 | 08:29 PM

ఓ వివాహ కార్యక్రమంలో ఉన్నట్టుండి సరదా సంఘటన చోటు చేసుకుంది. వధూవరులు బంధువుల సమక్షంలో దండలు మార్చుకున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఓ తమాషా సంఘటన చోటు చేసుకుంది..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

వివాహ కార్యక్రమాల్లో ఏ చిన్న సంఘటన జరిగినా అది వీడియో రూపంలో ఇట్టే నెట్టింట్లోకి వచ్చి చేరుతుంటుంది. వీటిలో కొన్ని వీడియోలు నెటిజన్లను తెగ నవ్విస్తుంటాయి. మరికొన్ని వీడియోలు అంతా అవాక్కయ్యేలా చేస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేదికపై వరుడి నిర్వాకానికి వధువు షాక్ అయింది. వధువుకు ఇష్టం లేకున్నా అతను చేసిన పనికి అంతా అవాక్కయ్యారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ పాత వీడియో (Viral Video) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో ఉన్నట్టుండి సరదా సంఘటన చోటు చేసుకుంది. వధూవరులు (bride and groom) బంధువుల సమక్షంలో దండలు మార్చుకున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఓ తమాషా సంఘటన చోటు చేసుకుంది. ప్లేటులో ఉన్న స్వీటును (Sweet) చేతిలోకి తీసుకున్న వధువు.. వరుడికి తినిపిస్తుంది.

Optical illusion: ఈ అడవిలో దాక్కున్న ఆవును.. 30 సెకన్ల లోపు గుర్తించడం మీ వల్ల అవుతుందా..


స్వీటును ఎంతో ఇష్టంగా తిన్న వరుడు ఆపై వధువుకు షాక్ ఇచ్చాడు. సగం స్వీటును తిన్న తర్వాత మిగతా సగాన్ని వధువుకు తినిపించే ప్రయత్నం చేస్తాడు. అయితే తనకు వద్దంటూ చేతులు అడ్డు పెడుతుంది. అయినా వరుడు వినిపించుకోకుండా స్వీటును ఆమె నోట్లో కుక్కుతాడు. ఆ తర్వాత నోట్లోని స్వీటును మొత్తం బయటికి ఉమ్మేస్తుంది. వరుడు చేసిన పనికి ఆమెకు కోపం వచ్చినట్లు అనిపించినా.. పైకి మాత్రం సైలెంట్‌గా కనిపిస్తుంది. ఆ తర్వాత వరుడికి తానే స్వయంగా నీళ్లు కూడా తాగిస్తుంది.

Viral Video: ఆహా.. చూడముచ్చటైన సీన్.. బుడ్డోడికి ఈ కుక్క ఎలా సాయం చేస్తుందో చూస్తే..


అయితే ఈ సందర్భంగా వరుడు తన జేబులోని చేతి రుమాలును తీసుకుని వధువు ముఖాన్ని శుభ్రం చేస్తాడు. ఇలా వధువుకు ఇష్టం లేకు్నా వరుడు బలవంతంగా స్వీటు తినించడం చూసి అక్కడున్న వారంతా పగలపడి నవ్వుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పెళ్లి తర్వాత ఇలాంటి సీన్ రిపీట్ అవుతుందేమో’’.. అంటూ కొందరు, ‘‘పెళ్లిలోనే ఇలా చేస్తున్నాడంటే.. జీవితంలో ఆమెను ఎన్ని ఇబ్బందులు పెడతాడో ఏమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఏనుగు శక్తి సరే.. యుక్తిని ఎప్పుడైనా చూశారా.. పనసపండును ఎలా తెంపిందంటే..


ఇవి కూడా చదవండి..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 12 , 2024 | 08:29 PM