Viral Video: ఆహా.. చూడముచ్చటైన సీన్.. బుడ్డోడికి ఈ కుక్క ఎలా సాయం చేస్తుందో చూస్తే..
ABN , Publish Date - Oct 12 , 2024 | 03:57 PM
మనుషుల్లో మానవత్వం రోజు రోజుకూ కనుమరుగవుతున్న ప్రస్తుత సమాజంలో జంతువులును చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. అందులోనూ కుక్కలు చేసే పనులు చూస్తే.. మనుషుల కంటే ఎంతో మేలని అనిపిస్తుంటుంది. కొన్నిసార్లు అవి తమ ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి..

మనుషుల్లో మానవత్వం రోజు రోజుకూ కనుమరుగవుతున్న ప్రస్తుత సమాజంలో జంతువులును చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. అందులోనూ కుక్కలు చేసే పనులు చూస్తే.. మనుషుల కంటే ఎంతో మేలని అనిపిస్తుంటుంది. కొన్నిసార్లు అవి తమ ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి.. తమ యజమాని కుటుంబ సభ్యులను కాపాడడం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బుడ్డోడికి కుక్క చేసిన సాయం చూసి అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బుడి బుడి అడుగులు వేస్తున్న బాలుడు ఇసుకలో నడుస్తుంటాడు. మామూలుగా నడవడమే కష్టం అనుకుంటే ఈ బుడ్డోడు ఏకంగా ఇసుక లోకే దిగేశాడు. కాళ్లు ఇసుకలో కూరుకుపోయి తూలిపడబోయే సమయంలో అక్కడే ఉన్న పెంపుడు కుక్క (dog helped child to walk) అక్కడికి వచ్చి.. సపోర్ట్‌గా నిలబడింది.
Viral Video: ఆభరణాల బ్యాగుతో స్కూటీపై ఉండగా.. దొంగ దాన్ని ఎంత సింపుల్‌గా ఎత్తుకెళ్లాడంటే..
కుక్క సాయంగా రావడంతో ఆ బుడ్డోడు కుక్క మీద చేయి వేసి, బ్యాలెన్స్‌గా ముందుకు నడవసాగాడు. కాస్త ముందుకు వెళ్లగానే మళ్లీ తూలిపడబోయే సమయంలో కుక్క చిన్నారి వెనుకే వెళ్లి సాయం చేస్తూ ఉంది. ఇలా చాలా దూరం బాలుడు నడిచేవరకూ పక్కనే వెళ్తూ సాయం చేసింది. ఈ చూడముచ్చటైన సన్నివేశాన్ని బాలుడి కుటుంబ సభ్యులు వీడియో తీసి, సోషల్ మీడియాలో ఫేర్ చేశారు.
Viral Video: ఈ ఫోన్ ముందు ఐ ఫోన్ కూడా దిగదుడుపే.. ఇందులోని ఆప్షన్ చూస్తే మతి పోవాల్సిందే..
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కుక్కను చూసి ఎంతో నేర్చుకోవాలి’’.. అంటూ కొందరు, ‘‘ఎంతో చూడముచ్చటగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 750కి పైగా లైక్‌లు, 2.4 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: పాము, ఆవు ఫ్రెండ్‌షిప్.. రెండూ కలిసి ఏం చేస్తున్నాయో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..
ఇవి కూడా చదవండి..
Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..
Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.
Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..
Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..
Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..