Share News

Actor Vinayakan: గోవాలో దాదాగిరి చేసిన నటుడు.. చివరికి ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Nov 25 , 2024 | 08:09 AM

ప్రముఖ నటుడు వినాయకన్.. దక్షిణాది సినిమాల్లో ఇప్పుడు బాగా పాపులరైన నటుడు. ఇటీవల విడుదలైన జైలర్ మూవీలో ఆయన నటన అద్భుతమనే చెప్పాలి. అయితే వెండి తెరపై ఎక్కువగా విలన్ వేషాలు వేసే అతను నిజ జీవితంలోనూ అలాగే ప్రవర్తిస్తుంటారు.

Actor Vinayakan: గోవాలో దాదాగిరి చేసిన నటుడు.. చివరికి ఏం జరిగిందంటే..
Actor Vinayakan

ఇంటర్నెట్ డెస్క్: నటన, వివాదాలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ నటుడు వినాయకన్ మరోసారి రచ్చ చేశారు. గోవాలో ఆయన చేసిన పని చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఫుల్‌గా మద్యం తాగి ఓ దుకాణం యజమానితో వాగ్వాదానికి దిగాడు వినాయకన్. ఇంగ్లీష్‌లో తిడుతూ షాపు ఓనర్‌ను దూషించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది. అతని ప్రవర్తన చూసిన వారంతా సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ ఈయన విలనే అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.


వివాదం ఇదే..

ప్రముఖ నటుడు వినాయకన్.. దక్షిణాది సినిమాల్లో ఇప్పుడు బాగా పాపులరైన నటుడు. ఇటీవల విడుదలైన జైలర్ మూవీలో ఆయన నటన అద్భుతమనే చెప్పాలి. అయితే వెండి తెరపై ఎక్కువగా విలన్ వేషాలు వేసే అతను నిజ జీవితంలోనూ అలాగే ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఆయన గోవాలో పర్యటించారు. ఏం జరిగింతో ఏమో తెలియదు కాని.. స్థానిక దుకాణం వద్ద ఆయన గొడవ పడుతూ కనిపించారు. ఓ దుకాణం యజమానిపై ఆగ్రహంతో ఊగిపోయారు. తీవ్ర కోపాన్ని ప్రదర్శించారు. షాపు యజమాని సైతం వినాయకన్‌కు గట్టిగానే సమాధానం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. వినాయకన్ ఫుల్‌గా మద్యం తాగినట్లు వీడియో ద్వారా అర్థం అవుతోంది. అయితే ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. వీడియో చూసిన అందరూ తొలుత ఏదో సినిమా షూటింగ్‌కు సంబంధించినదిగా భావించారు. అయితే అది ఏ సినిమా షూటింగ్‌కు సంబంధించినది కాదని తర్వాత తేలింది. దీంతో ఆయనకు వివాదాలు కొత్తేమీ కాదంటూ నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.


కొత్తేమీ కాదు..

అయితే నటుడు వినాయకన్‌కు వివాదాలు కొత్తేమీ కాదు. అక్టోబర్ నెలలో హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయన రచ్చరచ్చ చేశారు. సీఐఎస్ఎఫ్ సిబ్బందితో గొడవకు దిగడంతో పోలీసులు అతన్ని అరెస్టు సైతం చేశారు. సీఐఎస్ఎఫ్ సిబ్బందిని కొట్టారనే ఆరోపణలు సైతం అతనిపై ఉన్నాయి. కేరళలోని ఎర్నాకులంలో వినాయకన్‌కు సొంతిల్లు ఉంది. అయితే ఆయన రాత్రి మెుత్తం తాగుతూ పక్కింటి వారితో గొడవకు దిగాడు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన వినాయకన్ అక్కడా దురుసుగా ప్రవర్తించారు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అయితే వినాయకన్ తిరిగి బెయిల్‌పై విడుదల అయ్యారు. ఆయన మద్యానికి పూర్తిగా బానిసయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. అందుకే వినాయకన్ తరచూ వివాదాలకు వెళ్తున్నారని సినీవర్గాలు చెప్తున్నాయి. మంచి నటుడే అయినప్పటికీ ప్రవర్తన కూడా ముఖ్యమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Nov 25 , 2024 | 08:12 AM