Share News

Viral Video: వామ్మో.. ఒళ్లు గగుర్పొడిచే సీన్.. అడవి పంది ప్రాణాలతో ఉండగానే.. ఈ చిరుత పులి చేసిన పని చూస్తే..

ABN , Publish Date - Sep 21 , 2024 | 01:47 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ చిరుత పులి వేట చూసి వేచి చూస్తుండగా.. ఓ అడవి పంది కంటపడింది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా దానిపైకి దూకేసింది. అయితే అడవి పంది ప్రాణాలు తీయకుండా.. బతికుండగానే...

Viral Video: వామ్మో.. ఒళ్లు గగుర్పొడిచే సీన్.. అడవి పంది ప్రాణాలతో ఉండగానే.. ఈ చిరుత పులి చేసిన పని చూస్తే..

పులులు, సింహాల వేట ఎంత భయంకరంగా, ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాడి చేయడానే ముందుగా మెడ గట్టిగా కొరికి ప్రాణాలు తీస్తుంటాయి. ఆ తర్వాత క్షణాల్లో ప్రాణాలు తీసేసి, చూస్తుండగానే వాటిని పీస్ పీస్‌లు చేయడం చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, ఓ చిరుత పులి వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అడవి పంది ప్రాణాలతో ఉండగానే.. ఓ చిరుత పులి చేసిన నిర్వాకం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన దక్షిణాఫ్రికా (South Africa) క్రుగర్ నేషనల్ పార్క్‌లో చోటు చేసుకుంది. ఆకలితో ఉన్న ఓ చిరుత పులి వేట చూసి వేచి చూస్తుండగా.. ఓ అడవి పంది కంటపడింది. దీంతో ఏమాత్రం ఆలస్యం (leopard attacked warthog) చేయకుండా దానిపైకి దూకేసింది. అయితే అడవి పంది ప్రాణాలు తీయకుండా.. బతికుండగానే దాని కడుపులో రంధ్రం చేసి రక్తం తాగింది.

Optical Illusion: మీ కంటికి ఓ పెద్ద పరీక్ష.. ఈ చిత్రంలో దాక్కున్న ఐస్‌క్రీంను కనిపెట్టండి చూద్దాం..


ఓ వైపు పంది నొప్పితో విలవిల్లాడుతుండగా.. చిరుత పులి మాత్రం తాపీగా దాని కడుపులో అవయాలను కొరుకుతూ ఆకలి తీర్చుకుంది. ఇలా చాలా సేపు చిరుత పులి పందిని క్రూరంగా వేటాడింది. ఛాతీలో అంత రంధ్రం చేసినా పంది మాత్రం చిరుత నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఈ ఘటనను చూసిన పర్యాటకులు షాక్ అయ్యారు. వెంటనే తమ కెమెరాల్లో ఈ దృశ్యాన్ని బంధించారు.

Viral Video: హోటల్లో ఒంటరిగా కేక్ తింటున్న యువకుడు.. సైలెంట్‌గా దగ్గరికి వచ్చిన యువతులు.. చివరికి..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అడవి పందికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్న చిరుత’’.. అంటూ కొందరు, ‘‘అడవి పందిని చూస్తే పాపం అనిపిస్తోంది’’.. అంటూ మరికొందరు, ‘‘అడవిలో బతుకు పోరాటంలో జంతువుల మధ్య ఇలాంటివి సహజమే’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 82 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..


ఇవి కూడా చదవండి..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..


Updated Date - Sep 21 , 2024 | 01:50 PM