Share News

Viral Video: వామ్మో.. దఢ పుట్టిస్తున్న వీడియో.. ఖడ్గమృగాన్ని ఈ సింహం ఎలా తింటుందో చూస్తే..

ABN , Publish Date - Oct 19 , 2024 | 08:00 AM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ సింహం అడవిలో వేట కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంతలో దానికి ఓ ఖడ్గమృగం కనిపిస్తుంది. సాధారణంగా ఖడ్గమృగానికి దూరంగా ఉండే సింహం.. ఈ సారి మాత్రం..

Viral Video: వామ్మో.. దఢ పుట్టిస్తున్న వీడియో.. ఖడ్గమృగాన్ని ఈ సింహం ఎలా తింటుందో చూస్తే..

పులులు, సింహాలు దాడి ఎంత భయంకరరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి జంతువునైనా ఎంతో అవలీలగా దాడి చేసి మట్టుబెట్టగలవు. కొన్నిసార్లు సింహాల దాడి చూస్తే ఒళ్లు జలదరిస్తుంటుంది. ఇలాంటి భయంకర దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ సింహం ఖడ్గమృగంపై దాడి చేసే విధానం చూసి నెటిజన్లు ఖంగుతింటున్నారు. ఖడ్గమృగాన్ని ఈ సింహం ఎలా తింటుందో చూస్తే.. మీరు కూడా షాక్ అవుతారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ సింహం అడవిలో వేట కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంతలో దానికి ఓ ఖడ్గమృగం కనిపిస్తుంది. సాధారణంగా ఖడ్గమృగానికి దూరంగా ఉండే సింహం.. ఈ సారి మాత్రం ఎలాగైనా దాడి చేసి తినేయాలని ఫిక్స్ అయింది. ఎంతో చాకచక్యంగా (Lion attack on rhinoceros) దానిపై దాడి చేసి నేలకూల్చింది.

Viral Video: పానీపూరీ అంటే ఇష్టమా.. వీళ్లెలా చేస్తున్నారో చూస్తే.. నోరెళ్లబెడతారు..


అయితే ఖడ్గమృగాన్ని చంపేయకుండా.. ప్రాణంతో ఉండగానే తల వద్ద కొంచెం కొంచెం కొరుకుతూ ఉంది. సింహం అలా చేస్తుండడంతో మరో వైపు ఖడ్గమ‌ృగం విలవిల్లాడుతూ ఉంది. అయినా దాని దాడి నుంచి తప్పించుకునే అవకాశం లేక నిస్సహాయంగా ఉండిపోయింది. ఇలా ఆ సింహం చాలా సేపు ఖడ్గమృగాన్ని కొరుకుతూనే ఉంది. ఈ ఘటనను అక్కడే ఉన్న పర్యాటకులు చూసి షాక్ అయ్యారు.

Viral Video: కామ్‌గా ఉన్న ఎద్దును కెలికితే ఇలాగే ఉంటుంది మరీ.. వీడియో చూస్తే పగలబడి నవ్వాల్సిందే..


వెంటనే ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ‘‘బహుశా ఖడ్గమృగం అనారోగ్యానికి గురై ఉండాలి.. లేదంటే ఒక సింహం దాన్ని చంపే అవకాశమే లేదు’’.. అంటూ కొందరు, ‘‘ ఖడ్గమృగం శరీరం మందంగా ఉండడం వల్ల చంపడం సింహానికి సాధ్యం కాలేదు’’.. అంటూ మరికొందరు, ‘‘ఖడ్గమృగం చావుబతుకుల పోరాటం చూస్తుంటే బాధేస్తోంది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా లైక్‌లు, 40 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ప్రియుడితో ఉండగా సడన్‌గా తలుపు కొట్టిన తల్లి.. దొరక్కుండా ఉండేందుకు ప్రియుడిని ఏం చేసిందంటే..


ఇవి కూడా చదవండి..

Viral Video: ప్రియుడితో ఉండగా సడన్‌గా తలుపు కొట్టిన తల్లి.. దొరక్కుండా ఉండేందుకు ప్రియుడిని ఏం చేసిందంటే..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 19 , 2024 | 08:00 AM