Share News

Viral Video: ఈ పిల్ల సింహం కామెడీ మామూలుగా లేదుగా.. పడుకున్న సింహానికి ఎలా చిరాకు తెప్పిస్తోందో చూడండి..

ABN , Publish Date - Dec 21 , 2024 | 09:18 AM

సింహాలు అంటేనే సీరియస్ సంఘటనలు గుర్తుకొస్తుంటాయి. అయితే కొన్నిసార్లు వీటి మధ్య కూడా తమాషా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు వాటితో తమాషాగా ఆడుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. అలాగే మరికొన్నిసార్లు..

Viral Video: ఈ పిల్ల సింహం కామెడీ మామూలుగా లేదుగా.. పడుకున్న సింహానికి ఎలా చిరాకు తెప్పిస్తోందో చూడండి..

సింహాలు అంటేనే సీరియస్ సంఘటనలు గుర్తుకొస్తుంటాయి. అయితే కొన్నిసార్లు వీటి మధ్య కూడా తమాషా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు వాటితో తమాషాగా ఆడుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. అలాగే మరికొన్నిసార్లు చిన్న చిన్న జంతువులు సింహాలను కెలికి మరీ ఇబ్బంది పెట్టడం చూస్తుంటాం. పడుకున్న సింహంలో నక్క పిల్ల ఆడుకోవడం చూశాం. తాజాగా, సింహం పిల్ల వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. నిద్రపోతున్న సింహం వద్దకు వెళ్లిన పిల్ల సింహం.. చివరికి ఏం చేసిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అడవిలోని రోడ్డు పక్కన ఓ పెద్ద మగ సింహం (male lion) నిద్రపోతుంటుంది. అక్కడే కొన్ని పిల్ల సింహాలు ఆడుకుంటుంటాయి. అయితే ఈ క్రమంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఆడుకుంటున్న సింహం పిల్లల్లో ఒక పిల్ల అక్కడి నుంచి పక్కకు వచ్చి పడుకున్న సింహం వద్దకు వెళ్తుంది. దాన్ని చూడగానే కాసేపు సరదాగా ఆటపట్టించాలని ఆలోచన వచ్చినట్టుంది.

Viral Video: చిరుతకు షాక్ ఇచ్చిన కుందేలు.. పట్టుకోవాలని ప్రయత్నించగా చివరకు ఏం జరిగిందో చూడండి..


మెల్లగా దాని వద్దకు వెళ్లి తోకను పట్టుకుని కొరికింది. దీంతో పడుకున్న సింహం.. పైకి లేచి.. ‘‘ఎవరది నిద్రాభంగం చేస్తున్నారు’’.. అని అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి పడుకుంటుంది. అయినా ఆ పిల్ల సింహం (lion cub playing with sleeping lion's tail) పదే పదే తోకను పట్టుకుని కెలుకుతూ ఉంటుంది. ఎన్ని సార్లు తోకను పక్కకు తీసుకున్నా లాగి మరీ ఇబ్బంది పెడుతుంది. దీంతో ఆ సింహానికి చిర్రెత్తుకొచ్చి... సడన్‌గా పైకి ‘‘ఎహే.. ఎన్నిసార్లు చెప్పాలి.. పక్కకు వెళ్లి ఆడుకో’’.. అన్నట్లుగా గర్జిస్తూ భయపెడుతుంది. దెబ్బకు భయపడిపోయిన పిల్ల సింహం.. అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయి తోటి పిల్ల సింహంతో ఆడుకుంటుంది.

Viral Video: ఇలాంటి బహుమతి ఎక్కడైనా ఉంటుందా.. వరుడి స్నేహితుల నిర్వాకానికి అవాక్కైన వధువు..


ఈ ఘటన మొత్తం పర్యాటకుల సమక్షంలోనే జరుగుతుంది. అక్కడున్న వారంతా ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘తండ్రితో ఆడుకుంటున్న పిల్ల సింహం’’.. ‘‘ఈ సీన్ ఎంతో చూడముచ్చటగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1300కి పైగా లైక్‌లు, 5 లక్షలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: మరీ కరువు బ్యాచ్‌లా ఉన్నారే.. పెళ్లిలో దోసెలు వేస్తుండగా.. వీళ్ల నిర్వాకం చూస్తే..

Updated Date - Dec 21 , 2024 | 09:18 AM