Viral News: ప్రాణాలను పణంగా పెట్టి బ్రిడ్జిపై ఆగిన రైలుకు లోకోపైలట్ల మరమ్మతులు
ABN , Publish Date - Jun 22 , 2024 | 12:44 PM
ఇద్దరు లోకో పైలట్లు(Loco Pilots) తమ ధైర్యాన్ని ప్రదర్శించి చేసిన పనికి అనేక మంది నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అంతేకాదు వారు చేసిన పనికి ఇద్దరికీ 10 వేల రూపాయల రివార్డు కూడా లభించింది. అయితే వీరు ఏం పని చేశారు. ఎందుకు రివార్డు ఇచ్చారనే విషయాలు తెలుసుకుందాం.
ఇద్దరు లోకో పైలట్లు(Loco Pilots) తమ ధైర్యాన్ని ప్రదర్శించి చేసిన పనికి అనేక మంది నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అంతేకాదు వారు చేసిన పనికి ఇద్దరికీ 10 వేల రూపాయల రివార్డు కూడా లభించింది. అయితే వీరు ఏం పని చేశారు. ఎందుకు రివార్డు ఇచ్చారనే విషయాలు తెలుసుకుందాం. బీహార్(Bihar)లోని సమస్తిపూర్(Samastipur) రైల్వే సెక్షన్‌లోని బాల్మీకి నగర్, పనియావా స్టేషన్ మధ్య వంతెనపై రైలు అకస్మాత్తుగా ఆగిపోయింది. ఆ క్రమంలో రైలులోని అన్‌లోడర్ వాల్వ్ నుంచి వాయు పీడనం లీక్ అవడంతో రైలు మార్గమధ్యలోనే బ్రిడ్జిపై నిలిచిపోయింది.
ప్రమాదకరమని తెలిసినా..
దీంతో గమనించిన ఇద్దరు లోకో పైలట్లు రైల్వే టెక్నిషీయన్లకు(railway technicians) చెబితే వారు వచ్చే సరికి ఆలస్యం అవుతుందని గమనించి వారే ప్రమాదకరమని తెలిసినా కూడా విజయవంతంగా రిపేర్ చేశారు. ఆ క్రమంలో ఓ లోకో పైలట్ రైలు కిందకు చేరుకుని సురక్షితంగా ఇంజిన్‌కు వద్దకు చేరుకోగా, మరోక వ్యక్తి బ్రిడ్జ్ కింద ప్రమాదకర రీతిలో వేలాడుతూ మరమ్మతు చేశారు. అయితే వారు రిపేర్ చేస్తున్న క్రమంలో ఓ వ్యక్తి ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియా(social media)లో పోస్ట్ చేయడంతో అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన వారు ఔరా అంటూ వారు చేసిన పనిని మెచ్చుకుంటున్నారు.
సక్సెస్, రివార్డు..
మొత్తానికి లోకో పైలట్లు తమ ధైర్యాన్ని ప్రదర్శించి రైలు(train) కింద ఉన్న వంతెనపైకి వెళ్లి ఇంజిన్ లీకేజీని (engine leakage) సరిచేయడంలో విజయం సాధించారు. ఈ సమాచారం తెలుసుకున్న DAM వినయ్ శ్రీవాస్తవ ఇద్దరు లోకో పైలట్‌లకు 10,000 రూపాయల రివార్డును ప్రకటించారు. లోకో పైలట్లు తెలివిగా వ్యవహరించి రైలును ప్రయాణికులతో సురక్షితంగా ముందుకు కదిలేలా చేశారని సంతోషం వ్యక్తం చేశారు. వారి ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహించడం గ్రేట్ అని అన్నారు.
ఇవి కూడా చదవండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..