Share News

Money Saving Tips: నెలకు రూ. 20 వేలు 5 ఏళ్లు చెల్లిస్తే.. కోటీశ్వరులు అయ్యే ఛాన్స్..!

ABN , Publish Date - Jun 22 , 2024 | 11:57 AM

మీరు తక్కువ సమయంలో డబ్బులు పొదుపు(savings) చేసి కోటీశ్వరులు అవ్వాలని చూస్తున్నారా. అందుకు మీకోక మంచి ఛాన్స్ ఉంది. అదే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ELSS). దీనిలో మీరు ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు సిప్(SIP) విధానంలో పెట్టుబడి పెట్టి కోటీశ్వరులు అవ్వవచ్చు.

Money Saving Tips: నెలకు రూ. 20 వేలు 5 ఏళ్లు చెల్లిస్తే.. కోటీశ్వరులు అయ్యే ఛాన్స్..!
elss scheme investment

మీరు తక్కువ సమయంలో డబ్బులు పొదుపు(money savings) చేసి కోటీశ్వరులు అవ్వాలని చూస్తున్నారా. అందుకు మీకోక మంచి ఛాన్స్ ఉంది. అదే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ELSS). దీనిలో మీరు ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు సిప్(SIP) విధానంలో పెట్టుబడి పెట్టి కోటీశ్వరులు అవ్వవచ్చు. అయితే అందుకోసం నెలకు ఎంత చెల్లించాలి, ఎంత కాలం వేచి ఉండాలి, ఎన్ని సంవత్సరాలు చెల్లింపులు చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


మార్కెట్ లింక్డ్

మీరు కోటీశ్వరులు అవ్వాలంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ELSS)లో నెలకు రూ. 20 వేలు సిప్ విధానంలో ఇన్‌వెస్ట్ చేయాలి. ఆ విధంగా 2024 నుంచి ఐదేళ్లపాటు 2029 వరకు మొత్తం 12 లక్షలు చెల్లించాలి. ఆ తర్వాత మరో 15 ఏళ్ల వేచి ఉంటే మీకు కోటీ రూపాయల 24 లక్షలు వచ్చే అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల CAGR ఆధారంగా మీకు 22.76 శాతం రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లాక్ ఇన్ పీరియడ్‌లో మీరు పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు.


ELSS ఫండ్స్ అంటే ఏమిటి?

ELSS ఫండ్‌లు ఈక్విటీ ఫండ్‌లు. ఇవి తమ కార్పస్‌లో ఎక్కువ భాగాన్ని ఈక్విటీ లేదా ఈక్విటీ సంబంధిత సాధనాల్లో పెట్టుబడి పెడతాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపును కూడా పొందవచ్చు. అయితే ELSS మ్యూచువల్ ఫండ్స్ లక్షణాల గురించి ఇక్కడ చుద్దాం.

  • మొత్తం పెట్టుబడి పెట్టదగిన కార్పస్‌లో కనీసం 80 శాతం ఈక్విటీ లేదా ఈక్విటీ సంబంధిత సాధనాల్లో పెట్టుబడి పెడతారు

  • అన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్‌లు, వివిధ రంగాల ఫండ్‌లు ఈక్విటీలలో వైవిధ్యమైన పద్ధతిలో పెట్టుబడి పెడతాయి

  • కనీస పెట్టుబడి కాలం లేదు. అయితే లాక్ ఇన్ పీరియడ్ మూడేళ్లు

  • ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై పన్ను మినహాయింపు ప్రయోజనం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద అందుబాటులో ఉంది

గమనిక: మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు అనేవి మార్కెట్ రిస్క్‌పై ఆధారపడి ఉంటాయి. ఈ వార్తను చూసి పెట్టుబడి పెట్టి నష్టపోయినా, లాభం వచ్చినా ఆంధ్రజ్యోతికి సంబంధం లేదు. కాబట్టి ఈ పొదుపుల విషయంలో నిపుణుల సలహా తీసుకుని పెట్టుబడులు చేయాలని సూచన.


ఇది కూడా చదవండి:

EMI Bouncing: మీ ఈఎంఐలు బౌన్స్ అవుతున్నాయా.. సిబిల్ స్కోర్ ప్రభావితం కాకుండా ఉండేందుకు ఇలా చేయండి


New Telecommunications Act: మరికొన్ని రోజుల్లో కొత్త టెలికమ్యూనికేషన్స్ చట్టం అమలు.. మార్పులివే..


For Latest News and Business News click here

Updated Date - Jun 22 , 2024 | 12:00 PM