Share News

Viral Video: జలపాతం వద్ద యువకుడికి షాకింగ్ అనుభవం.. కంగారుగా బయటికి వచ్చి ప్యాంట్‌లో చూసుకోగా..

ABN , Publish Date - Jul 05 , 2024 | 08:10 PM

కొన్నిసార్లు కొందరిని ప్రమాదాలు ఊహించని విధంగా వెంటాడుతుంటాయి. ఈ క్రమంలో కొందరు అదృష్టం బాగుండి తృుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడుతుంటారు. సోషల్ మీడియాలో ఇలాంటి అనేక వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. వీటిలో...

Viral Video: జలపాతం వద్ద యువకుడికి షాకింగ్ అనుభవం.. కంగారుగా బయటికి వచ్చి ప్యాంట్‌లో చూసుకోగా..

కొన్నిసార్లు కొందరిని ప్రమాదాలు ఊహించని విధంగా వెంటాడుతుంటాయి. ఈ క్రమంలో కొందరు అదృష్టం బాగుండి తృుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడుతుంటారు. సోషల్ మీడియాలో ఇలాంటి అనేక వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. వీటిలో షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడికి జలపాతం వద్ద ఈత కొడుతుండగా షాకింగ్ అనుభవం ఎదురైంది. కంగారుగా నీళ్లలో నుంచి బయటికి వచ్చి ప్యాంట్‌లో చూసుకుని షాక్ అయ్యాడు. ఇంతకీ అసలేమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి జలపాతం (waterfall) వద్దకు వెళ్తాడు. అక్కడ అంతా కలిసి ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. వారిలో ఓ యువకుడు ఈత కొడుతుండగా.. ప్యాంట్‌లో ఏదో కదులుతున్నట్లు అనిపించింది. దీంతో కంగారుగా నీళ్లో నుంచి బయటికి వచ్చి చూసుకుంటే పెద్ద పాము (snake) కనిపించింది.

Viral Video: రీల్స్ కోసం బాలిక వింత ప్రవర్తన.. స్లోమోషన్ చేసే క్రమంలో ఆమె చేసిన నిర్వాకం..


ప్యాంట్‌లోకి దూరిన పాము తలను అతను గట్టిగా పట్టుకుంటాడు. ఈ క్రమంలో చుట్టూ ఉన్న అతడి స్నేహితులు కాపాడే ప్రయత్నం చేస్తారు. దగ్గరికి వచ్చి ధైర్యంగా పాము తోకను పట్టుకుంటారు. బాధిత యువకుడు పాము తలను పట్టుకునే ఉంటాడు. ఇలా కొంత సేపటి తర్వాత మెల్లగా పైకి లేచి పామును వదలగానే పక్కనే ఉన్న అతడి స్నేహితులు.. పామును వేగంగా బయటికి లాగేస్తారు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.

Viral Video: వామ్మో..! ఎర్ర చీమలతో చట్నీ.. చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..


అయితే ఈ ఘటనలో యువకుడిని పాము కాటేసిందా లేదా అన్న విషయం తెలియరాలేదు. పరిస్థితి చూస్తుండటే అతడికి ఎలాంటి ప్రాణహాని లేనట్లు కనిపిస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. చూస్తుంటేనే ఒళ్లు జలదరిస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి ప్రదేశాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.50లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పిల్లాడు ఆడుకుంటుండగా.. ఇంట్లోకి దూరిన పాము.. చివరకు బుడ్డోడు చేసిన నిర్వాకం చూస్తే..

Updated Date - Jul 05 , 2024 | 08:57 PM