Share News

Viral Video: బైకును కారులా మార్చేశాడుగా.. వీడియో చూసిన నెటిజన్లు ఏమంటున్నారంటే..

ABN , Publish Date - Aug 13 , 2024 | 04:47 PM

వాహనాలపై విచిత్ర ప్రయోగాలు చేయడం, చివరకు వాటిని చిత్రవిచిత్రగా మార్చడం చూస్తూనే ఉంటాం. కొందరు సైకిల్ హ్యాండిల్‌‌కు బైకు స్టీరిగ్ అమర్చడం చూశాం. ఇంకొందరు బైకును ఆటోగా, మరికొందరు ఆటోను కారు తరహాలో మార్చడం చూశాం. ఇంకొందరైతే...

Viral Video: బైకును కారులా మార్చేశాడుగా.. వీడియో చూసిన నెటిజన్లు ఏమంటున్నారంటే..

వాహనాలపై విచిత్ర ప్రయోగాలు చేయడం, చివరకు వాటిని చిత్రవిచిత్రగా మార్చడం చూస్తూనే ఉంటాం. కొందరు సైకిల్ హ్యాండిల్‌‌కు బైకు స్టీరిగ్ అమర్చడం చూశాం. ఇంకొందరు బైకును ఆటోగా, మరికొందరు ఆటోను కారు తరహాలో మార్చడం చూశాం. ఇంకొందరైతే ఓ అడుగు ముందుకేసి బైకు గేర్ స్థానంలో బస్సు గేర్ అమర్చడం కూడా చూశాం. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన బైకును కారుగా మార్చాలని అనుకున్నాడు. చివరకు అతడు చేసిన ప్రయోగం చూసి నెటిజన్లు ఏమంటున్నారంటే..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన బైకును కారు తరహాలో మార్చాలని నిర్ణయించుకున్నట్లున్నాడు. ఇందుకోసం తన బైక్‌ హ్యాండిల్ స్థానంలో (man fitted Car steering to the bike) కారు స్టీరింగ్ అమర్చాడు. ఫైనల్‌గా బైక్‌ను స్టార్ట్ చేసి తన ప్రయోగాన్ని పరీక్షించాడు.

Viral Video: లోయలో అందమైన రీల్ చేయాలని చూశాడు.. రెండు అడుగులు వేయగానే..


కారు తరహాలోనే తన బైక్ స్టీరింగ్‌ను అటూ, ఇటూ తిప్పుతూ వాహనాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. బైక్ ముందు వైపు చూస్తే.. అదేదో విచిత్రమైన కారులా కనిపిస్తోంది. ఇతడి వింత ప్రయోగానికి సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారిలో కొందరు అతడి తెలివితేటలను అభినందిస్తుంటే.. మరికొందరు తమ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

Viral Video: అవి చేతులా లేక రబ్బరు పైపులా.. ఇతడు చేస్తున్న విన్యాసం చూస్తే..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘నో బ్రేక్, నోక్లచ్, నో ఎక్సలేటర్’’.., ‘‘పరిష్కారం లేకుండా సమస్యను స‌ృష్టించారు’’.., ‘‘ఇండియాలో ఇలాంటి టాలెంట్‌కు కొదవే లేదు’’.., ‘‘క్లచ్, బ్రేకు వేయాలంటే ఎలా మరి’’.., ‘‘బ్రేక్, క్లచ్ లేకుండా ఇది ఆటోమేటిక్‌లా ఉందే’’.. అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 లక్షలకు పైగా లైక్‌లను సొంత చేసుకుంది.

Viral Video: హాయిగా పడుకుందామని వెళ్లాడు.. మంచం కింద నుంచి శబ్ధాలు రావడంతో.. పరుపు తీసి చూడగా..

Updated Date - Aug 13 , 2024 | 04:47 PM