Share News

Viral Video: సబ్‌మెరైన్‌లా మారిన ట్రాక్టర్.. నీటిలోకి వెళ్లగానే షాకింగ్ సీన్.. చివరకు చూస్తే..

ABN , Publish Date - Aug 11 , 2024 | 10:50 AM

సోషల్ మీడియాలో ఓ పాత వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు వ్యక్తులు ఓ పెద్ద ట్రాక్టర్ ఇంజన్‌పై వెళ్తుంటారు. అయితే దారి మధ్యలో రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. దీంతో చాలా వాహనాలు అవతలి వైపునకు వెళ్లలేక అక్కడే ఆగిపోయాయి. అయితే..

Viral Video: సబ్‌మెరైన్‌లా మారిన ట్రాక్టర్.. నీటిలోకి వెళ్లగానే షాకింగ్ సీన్.. చివరకు చూస్తే..

వాహనాల డ్రైవింగ్ సమయంలో కొన్నిసార్లు చిత్రవిచిత్ర ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. ముఖ్యంగా వర్షాకాలంలో కొన్నిసార్లు షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. రోడ్డుపై వరద నీరు ప్రవహింసే సమయంలో కొందరు వాహనాలను నిర్లక్ష్యంగా నడుపుతూ చివరకు ప్రమాదాలకు గురవడం జరుగుతుంటుంది. అయితే మరికొందరు ఎంతో చాకచక్యంగా దాటుకుని వెళ్లిపోతుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇద్దరు వ్యక్తులు ట్రాక్టర్‌లో వెళ్తుండగా.. దారి మధ్యలో రోడ్డుపై వరదనీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. అయినా ట్రాక్టర్‌ను నీటిలోకి దించేయడంతో చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ పాత వీడియో (Viral Video) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు వ్యక్తులు ఓ పెద్ద ట్రాక్టర్ ఇంజన్‌పై వెళ్తుంటారు. అయితే దారి మధ్యలో రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. దీంతో చాలా వాహనాలు అవతలి వైపునకు వెళ్లలేక అక్కడే ఆగిపోయాయి. అయితే ట్యాక్టర్ ఇంజిన్‌ను నడుపుతున్న వ్యక్తి మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా (tractor went into flood water) వాహనాన్ని వరద నీటిలోకి దింపేస్తాడు.

Viral Video: వామ్మో.. మొసళ్ల గుంపు మధ్యలో వ్యక్తి వాకింగ్.. కాలు మోపగానే అవి చేసిన పని చూడండి..


కాస్త ముందుకు వెళ్లగానే ఇంజిన్ మొత్తం నీటిలో మునిగిపోతుంది. కొట్టుకుపోయిందే అని ఒడ్డున ఉన్న వారంతా కంగారుగా చూస్తున్నారు. కొద్ది సేపు నీటిలో మునిగిపోయిన ట్రాక్టర్.. కాసేపటి తర్వాత ఆశ్చర్యకరంగా బయటికి దూసుకొచ్చింది. అవతలి ఒడ్డుకు ఎంతో సులభంగా చేరుకుంది. ఈ ఘటనను చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. నీటిలోకి వెళ్లగానే ఇంజిన్ ఆఫ్ కాకుండా ఎలా నడిచిందని అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

Viral Video: పామును చూసి వణికిపోయిన పులి.. రోడ్డుపై కోబ్రా ఎదరుపడగానే.. ఒక్కసారిగా..


ఈ ఘటన కెన్యాలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. చాలా కాలం కిందటి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది.. ఇది ఎలా సాధ్యమైంది’’.. అంటూ కొందరు, ‘‘ఇది ఫేక్ వీడియో కావచ్చు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: లోయలో అందమైన రీల్ చేయాలని చూశాడు.. రెండు అడుగులు వేయగానే..

Updated Date - Aug 11 , 2024 | 10:50 AM