Share News

Viral Video: ఇది మామూలు టాలెంట్ కాదు భయ్యా.. సైకిల్ టైర్లతో ఇతను చేసిన విన్యాసం చూస్తే..

ABN , Publish Date - Oct 03 , 2024 | 06:41 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి సైకిల్‌పై విచిత్ర విన్యాసం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. సైకిల్‌పై చాలా మంది విన్యాసాలు చేస్తుంటారు. కొందరు సైకిల్ ముందు చక్రాన్ని..

Viral Video: ఇది మామూలు టాలెంట్ కాదు భయ్యా.. సైకిల్ టైర్లతో ఇతను చేసిన విన్యాసం చూస్తే..

చిత్రవిచిత్ర విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు ఇంద్రజాలం చేసి అందరినీ ఆశ్చర్యపరిస్తే.. మరికొందరు సైకిళ్లు, బైకులతో అనితర సాధ్యమైన విన్యాసాలు చేస్తూ అందరినీ షాక్‌కు గురి చేస్తుంటారు. కొన్నిసార్లు కొందరు చేసే విన్యాసాలు చూస్తే.. ‘‘అరే.. ఇదెలా సాధ్యం’’.. అని అనిపిస్తుంటుంది. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి సైకిల్ టైర్లపై చేసిన విన్యాసం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇది మూమూలు టాలెంట్ కాదు భయ్యా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి సైకిల్‌పై విచిత్ర విన్యాసం (innovative stunt on bicycle) చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. సైకిల్‌పై చాలా మంది విన్యాసాలు చేస్తుంటారు. కొందరు సైకిల్ ముందు చక్రాన్ని గాల్లోకి లేపి నడుపుతూ విన్యాసం చేస్తుంటే.. మరికొందరు హ్యాండిల్‌పై కూర్చుని.. ఇలా అనేక రకాలుగా స్టంట్స్ చేయడం చూస్తుంటాం.

Viral Video: యాంటెన్నా పైనుంచి వేలాడుతూ కాకిని పట్టుకున్న పాము.. చివరకు ఏం జరిగిందో చూస్తే..


కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో వ్యక్తి చేసిన వినూత్న విన్యాసం చూసి అంతా అవాక్కతున్నారు. హ్యాండిల్‌తో ఉన్న సైకిల్ ముందు టైరు, సీటుతో పాటూ ఉన్న వెనుక టైరును విడివిడిగా తీసుకుంటాడు. ముందు వెనుక టైరుపై కూర్చుని ముందు టైరు హ్యాండిల్ పట్టుకుని బ్యాలెన్స్ చేస్తాడు. ఆ తర్వాత వెనుక టైరుకు అమర్చిన పెడల్‌ తొక్కుతూ చేతులతో పట్టుకున్న హ్యాండిల్‌ను కూడా కంట్రోల్ చేస్తాడు.

Viral Video: ఈ పాముకు అత్యాశ ఎక్కువనుకుంటా.. గుడ్డును తినబోయి చివరకు అది చేసిన నిర్వాకం చూసి అంతా షాక్..


ముందు కాస్త తడపడినా కాస్త దూరం వెళ్లగానే అచ్చం సైకిల్‌ను ఎలాగైతే నడుపుతారో.. అదే విధంగా రెండు టైర్లను నడుపుతూ ముందుకు దూసుకెళ్తాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అక్టోబర్‌ను 2న షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కోహ్లీకి కొత్త రూల్స్ నేర్పించిన అనుష్క.. చివరకు అతడి పరిస్థితి ఏమైందో మీరే చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: వర్షంలో తడుస్తూ వచ్చిన వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. సమీపానికి రాగానే అతడు చేసిన నిర్వాకం..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 03 , 2024 | 06:41 PM