Share News

Viral Video: ఈ పాముకు అత్యాశ ఎక్కువనుకుంటా.. గుడ్డును తినబోయి చివరకు అది చేసిన నిర్వాకం చూసి అంతా షాక్..

ABN , Publish Date - Oct 03 , 2024 | 04:15 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ పాము ఏదైనా తారసపడితే తినేయాలని ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమంలో దానికి గుడ్డు కనిపిస్తుంది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది..

Viral Video: ఈ పాముకు అత్యాశ ఎక్కువనుకుంటా.. గుడ్డును తినబోయి చివరకు అది చేసిన నిర్వాకం చూసి అంతా షాక్..

సోషల్ మీడియాలో పాములు, కొండచిలువకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. వీటిలో చిత్రవిచిత్రంగా ప్రవర్తించే పాముల వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. కొన్ని పాములు కప్పలు, ఎలుకలకు బదులుగా వింత వింత జీవులు, వస్తువులను తినడం చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు అందరినీ షాక్‌కు గురి చేస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ పాము వేటలో భాగంగా గుడ్డును తినేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో అది చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ పాముకు అత్యాశ ఎక్కువనుకుంటా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ పాము ఏదైనా తారసపడితే తినేయాలని ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమంలో దానికి గుడ్డు కనిపిస్తుంది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. పైపులో ఇరుక్కున్న గుడ్డును చూసి ఎలా తినేయాలో తెలీక.. చివరకు గుడ్డుతో పాటూ (snake swallowed plastic pipe) పైపును కూడా మింగేసింది.

Viral Video: కోహ్లీకి కొత్త రూల్స్ నేర్పించిన అనుష్క.. చివరకు అతడి పరిస్థితి ఏమైందో మీరే చూడండి..


అయితే ప్టాస్టిక్ పైపు కావడంతో కడుపులోకి వెళ్లగానే.. పాము చాలా ఇబ్బంది పడింది. సదరు ఇంట్లో ఉంటున్న వారు ఈ పామును చూసి షాక్ అయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్.. ఎంతో చాకచక్యంగా పామును పట్టుకుని బయటికి తీసుకొచ్చాడు. పాము తోక పట్టుకుని తలకిందులుగా చేసి, కడుపులో ఉన్న పైపును అతి కష్టం మీద కక్కేలా చేశాడు. చివరకు గుడ్డుతో పాటూ పెద్ద పైపును బయటకు కక్కేయడం చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.

Viral Video: కింగ్‌ఫిషర్ పవర్ ఎలా ఉంటుదో ఎప్పుడైనా చూశారా.. నీటిలోకి బుల్లెట్‌లా దూసుకెళ్లి.. చూస్తుండగానే..


గతంలో ఇలాగే చాలా పాములు ఇనుప వస్తువులు, ప్లాస్టిక్ డబ్బాలు మింగిన ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇలాంటి సీన్ ఇదే మొదటిసారి చూస్తు్న్నాం’’.. అంటూ కొందరు, ‘‘ఈ పాము మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 74 వేలకు పైగా లైక్‌లు, 4.2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇంట్లోకి చొరబడుతున్న దొంగలు.. మహిళ తెలివిగా చేసిన పనితో.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: వర్షంలో తడుస్తూ వచ్చిన వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. సమీపానికి రాగానే అతడు చేసిన నిర్వాకం..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 03 , 2024 | 04:15 PM