Share News

Viral: ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టి స్టైల్‌గా నిలబడ్డాడు.. అనుమానంతో పోలీసులు తనిఖీ చేయగా.. షాకింగ్ సీన్..

ABN , Publish Date - Oct 29 , 2024 | 07:02 PM

ఓ వ్యక్తి విమానశ్రయంలో ప్రయాణికుల మధ్యలో ఓ వ్యక్తి రెండు చేతులను ప్యాంట్ జేబుల్లో పెట్టుకుని స్లైల్‌గా నిలబడ్డాడు. అతన్ని చూడగానే పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో చివరకు అతన్ని అదుపులోకి తీసుకుని పరిశీలించగా.. షాకింగ్ సీన్ కనిపించింది..

Viral: ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టి స్టైల్‌గా నిలబడ్డాడు.. అనుమానంతో పోలీసులు తనిఖీ చేయగా.. షాకింగ్ సీన్..
ప్రతీకాత్మక చిత్రం

విమానాశ్రయాల్లో కొన్నిసార్లు వింత వింత కేసులు వెలుగులోకి వస్తుంటాయి. నేరాలకు పాల్పడేవారు పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు వివిధ రకాలుగా ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలో కొందరి తెలివితేటలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి ఆశ్చర్యకర ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వార్త ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. విమానాశ్రయంలో ఓ వ్యక్తి తన ఫ్యాంట్‌లో రెండు చేతులు పెట్టుకుని, స్టైయిల్‌గా నిలబడ్డాడు. అయితే పోలీసులకు అనుమానం వచ్చి తనిఖీ చేయగా.. చివరకు షాకింగ్ దృశ్యం కనిపించింది. వివరాల్లోకి వెళితే..


సోషల్ మీడియాలో ఓ వార్త (viral news) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన తమిళనాడు (Tamil Nadu) తిరుచ్చిలో చోటు చేసుకుంది. బంగారం అంటే ఇష్టపడని వారుండరు. సామాన్యుల దగ్గర నుంచి ధనవంతుల వరకూ అంతా ఇష్టపడే వస్తువుల లిస్ట్‌లో బంగారం మొదటి స్థానంలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం. ప్రతి ఒక్కరూ బంగారాన్ని తమ స్టేటస్‌కు సింబల్‌లా భావిస్తుంటారు. ఇంత డిమాండ్ ఉండడంతో ఏడాదికేడాది దీని ధరలు పెరిగిపోతూ వస్తున్నాయి. అయినా బంగారాన్ని కొనేందుకు ఎవరూ వెనుకాడడం లేదు. దీంతో చాలా మంది దీన్నొక వ్యాపారంలా తీసుకుంటున్నారు. మరికొందరు విదేశాల్లో తక్కువ ధరకు కొని ఇండియాకు తరలించి వ్యాపారం చేస్తున్నారు.

Viral Video: ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. ఇతడి తెలివి ముందు ఎంతటి మేధావులైనా దిగదుడుపే..


gold-in-trouser-pocket.jpg

ఇటీవల అనేక విమానాశ్రయాల్లో బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన వారిని చూస్తు్న్నాం. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు కొందరు ఏకంగా బంగారాన్ని కడుపులో దాచుకుని రావడం కూడా చూశాం. తాజాగా, తిరుచ్చి విమానాశ్రయంలో (Trichy Airport) ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ వ్యక్తి రెండు చేతులను జేబులో పెట్టుకుని స్లైల్‌గా నడుచుకుంటూ వస్తున్నాడు. అయితే అతన్ని చూడగానే పోలీసులకు అనుమానం కలిగింది. చివరకు అదుపులోకి తీసుకుని పరిశీలించగా.. షాకింగ్ దృశ్యం కనిపించింది.

Viral Video: పురాతన ఆలయం వద్ద ఈ ఎలుగుబంటి చేస్తున్నన పని చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..


ఆ వ్యక్తి ప్యాంట్ జేబులో పరిశీలించగా రూ.1.16 కోట్ల విలువ చేసే 1,488.000 గ్రాముల బరువున్న బంగారు చైన్లు, గాజులు కనిపించాయి. వాటిని చూసిన పోలీసులకు మైండ్ బ్లాక్ అయినంత పనైంది. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అతన్ని విచారిస్తున్నారు. అయితే ఈ వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి ఈ బంగారు తీసుకొచ్చాడు.. దీని వెనుక ఎవరైనా ఉన్నారా.. అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో వీడి తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఫ్యాంట్ జేబులో కోటి బంగారం.. నువ్వు సూపర్ బాసూ’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: కంటికి కనిపించేందంతా నిజం కాదంటే ఇదేనేమో.. ఈ చిన్నారి వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Updated Date - Oct 29 , 2024 | 07:07 PM