Share News

Viral Video: లవ్ సింబల్ వెలుగులో ప్రేమికుల రొమాన్స్.. మధ్యలో ఎంటరై.. ఇతను చేసిన పని..

ABN , Publish Date - May 11 , 2024 | 08:09 PM

సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు చిత్రవిచిత్ర ప్రయోగాలన్నీ చేసేస్తుంటారు. ఇంకొందరు ఏదోటి చేసి ఎలాగైనా నెటిజన్ల దృష్టిలో పడాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఈ క్రమంలో వారు చేసే పనులు చూస్తే కొన్నిసార్లు తెగ నవ్వు వస్తుంటుంది. ఇలాంటి..

Viral Video: లవ్ సింబల్ వెలుగులో ప్రేమికుల రొమాన్స్.. మధ్యలో ఎంటరై.. ఇతను చేసిన పని..

సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు చిత్రవిచిత్ర ప్రయోగాలన్నీ చేసేస్తుంటారు. ఇంకొందరు ఏదోటి చేసి ఎలాగైనా నెటిజన్ల దృష్టిలో పడాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఈ క్రమంలో వారు చేసే పనులు చూస్తే కొన్నిసార్లు తెగ నవ్వు వస్తుంటుంది. ఇలాంటి తమాషా సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. లవ్ సింబల్ వెలుగులో ఓ ప్రేమ జంట రొమాన్స్ చేస్తుండగా.. మధ్యలో ఓ వ్యక్తి ఎంటరై.. చివరకు ఏం చేశాడో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ప్రేమ జంట కోసం స్నేహితులంతా కలిసి ఫొటోషూట్‌ను వినూత్నంగా ప్లాన్ చేస్తారు. ఇందుకోసం వారు లవ్ సింబల్ (Love symbol) ఆకారంలో దీపాలను ఏర్పాటు చేస్తారు. దీపాలన్నీ జిగేల్ జిగేల్‌మని వెలుగుతుండగా.. మధ్యలో ప్రేమ జంట (lovers) నిలబడి ఉంటుంది. ఈ క్రమంలో ప్రియుడు తన ప్రియురాలికి ముద్దు పెట్టబోతాడు. ఇంతలో తమాషా సంఘటన చోటు చేసుకుంటుంది. పక్కనే నిలబడి ఉన్న వారిలో ఓ వ్యక్తి.. సడన్‌గా ప్రేమికుల సమీపానికి వచ్చేస్తాడు.

Viral Video: నిర్మానుష్య ప్రదేశంలో ఆటోను ఆపిన డ్రైవర్.. ఏం చేస్తున్నాడని చూడగా.. వెనుక సీట్లో..


కింద లవ్ సింబల్ ఆకారంలో వరుసగా ఉంచిన దీపాల్లో ఒకదాన్ని చేత్తో తీసుకుని, సిగరెట్‌కు నిప్పు అంటించుకుంటాడు. తర్వాత ఆ దీపాన్ని యథావిధిగా అక్కడే పెట్టి మళ్లీ వెనక్కు వెళ్తాడు. ప్రేమికులు డీప్ లవ్‌లో ఉండగా.. మధ్యలో ఇతను చేసిన నిర్వాకం చూసి అక్కడున్న మిగతా స్నేహితులంతా పగలబడి నవ్వుకుంటారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వీడెవడో గానీ.. విచిత్రంగా ఉన్నాడే’’.. అంటూ కొందరు, ‘‘ఇతడి కోసమే దీపాలు పెట్టినట్లు ఉన్నారు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 48లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వేదిక పైనే మరదలితో కలిసి డాన్స్ చేసిన వరుడు.. ఓపిగ్గా చూసిన వధువు.. చివరకు..

Updated Date - May 11 , 2024 | 08:09 PM