Share News

Viral Video: పర్‌ఫెక్ట్ ట్రైనింగ్.. రోడ్డుపై ఈ ఎలుగుబంటి చేస్తున్న పని చూడండి..

ABN , Publish Date - May 10 , 2024 | 05:38 PM

పిల్లల తప్పులు సరిదిద్దుతూ, వారికి దిశాదిర్దేశం చేయడంలో మనుషుల కంటే కొన్నిసార్లు జంతువులే బెటర్ అని అనిపిస్తుంటుంది. అందులోనూ పిల్లల పట్ల రాక్షసంగా ప్రవర్తించే తల్లిదండ్రులకు కనువిప్పు కలిగించేలా కొన్ని జంతువులు ప్రవర్తిస్తుంటాయి. ఇలాంటి...

Viral Video: పర్‌ఫెక్ట్ ట్రైనింగ్.. రోడ్డుపై ఈ ఎలుగుబంటి చేస్తున్న పని చూడండి..

పిల్లల తప్పులు సరిదిద్దుతూ, వారికి దిశాదిర్దేశం చేయడంలో మనుషుల కంటే కొన్నిసార్లు జంతువులే బెటర్ అని అనిపిస్తుంటుంది. అందులోనూ పిల్లల పట్ల రాక్షసంగా ప్రవర్తించే తల్లిదండ్రులకు కనువిప్పు కలిగించేలా కొన్ని జంతువులు ప్రవర్తిస్తుంటాయి. ఇలాంటి సందేశాత్మక విడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఎలుగుబంటికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. రోడ్డు దాటడంలో తన పిల్లలకు ట్రైనింగ్ ఇస్తున్న ఎలుగుబంటి నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అమెరికాలోని (America) నార్త్ కరోలినా రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కారులో వెళ్తుండగా.. మార్గ మధ్యలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ ఎలుగుబంటి రోడ్డు (bear crossing the road) దాటుతూ కనిపించింది. దీంతో అతను తన కారును దూరంగా నిలిపేశాడు. చెట్ట పొదల నుంచి రోడ్డు పైకి వచ్చిన ఎలుగుబంటి కాసేపు ఆగుతుంది. అంతలో దాని వెనుకే రెండు పిల్లలు కూడా వస్తాయి. రోడ్డు పైకి వచ్చిన ఎలుగుబంటి నిలబడి అటూ ఇటూ చూసి వాహనాలు వస్తున్నాయో, లేదో గమనిస్తుంది. తర్వాత కాస్త ముందుకు వెళ్లి, మళ్లీ వెనక్కు తిరిగి తన పిల్లలు వెనుకే వస్తున్నారా.. లేదా.. అని చూస్తుంది.

Viral Video: దారికి అడ్డుగా పడుకున్న ఎలిగేటర్లను.. ఈ సైక్లిస్టు ఎలా దాటుకెళ్లాడో చూస్తే..


ఆ తర్వాత ఎలా నడవాలి అన్నది కూడా తన పిల్లలకు చూపిస్తుంది. ‘‘రోడ్డుపై అటూ, ఇటూ చూసి జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్లాలి’’.. అని వాటికి చెబుతున్నట్లుగా ఆ ఎలుగుబంటి రోడ్డు దాటడంపై అవగాహన కల్పిస్తుంది. రోడ్డు అవతల వరకూ తన పిల్లలను ఎంతో జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా, వాటికి అవగాహన కూడా కల్పిస్తుంది. ఎలుగుబంటిని చూసి ఆశ్చర్యపోయిన కారులోని వ్యక్తి.. ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పిల్లల పెంపకం అంటే ఇలా ఉండాలి’’.. అంటూ కొందరు, ‘‘రోడ్డు దాటడంపై ఇంతకంటే బాగా ఎవరూ వివరించలేరు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 12లక్షలకు పైగా లైక్‌లు, 25 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: తాబేళ్లకు ఆహారం వేస్తున్న యువతికి షాక్.. ఉన్నట్టుండి ఏం జరిగిందో చూస్తే..

Updated Date - May 10 , 2024 | 05:38 PM