Share News

Viral video: ఇతడి తెలివి సల్లగుండ.. ఏకంగా ఇటుకలతోనే కూలర్ చేశాడుగా..

ABN , Publish Date - May 07 , 2024 | 07:11 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. తనకు వచ్చిన పనితోనే ఇంట్లో చల్లదనం వచ్చేలా చేయాలని ప్రయత్నించాడు. ఇందుకోసం..

Viral video: ఇతడి తెలివి సల్లగుండ..  ఏకంగా ఇటుకలతోనే కూలర్ చేశాడుగా..

ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తుంటారు. డబ్బులు ఉన్న వారు ఖరీదైన కూలర్లు, ఏసీలు ఏర్పాటు చేసుకుంటే.. సామాన్యులు తమకు అందుబాటులో ఉన్న వస్తువులతోనే సరిపెట్టుకుంటుంటారు. అయితే ఈ క్రమంలో కొందరు తమ తెలివికి పదును పెట్టి వినూత్న ప్రయోగాలు చేయడం చూస్తుంటాం. కొందరు తమ ఇంటిపై స్పింకర్లు ఏర్పాటు చేస్తే.. మరికొందరు పాడైపోయిన కూలర్‌ను ఫ్రిడ్జ్ ఎదురుగా ఉంచి, తద్వారా చల్ల గాలిని ఆస్వాదించడం చూశాం. తాజాగా, ఓ వ్యక్తి ఇటుకలతో కూలర్ తయారు చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. తనకు వచ్చిన పనితోనే ఇంట్లో చల్లదనం వచ్చేలా చేయాలని ప్రయత్నించాడు. ఇందుకోసం తన ఇంట్లో ఓ చోట ఇటుకలతో నిర్మాణం మొదలెట్టాడు. కూలర్ ఆకారంలో ఇటుకలను (bricks ) పేర్చి... ఫ్యాన్ ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించాడు. అందులో ఓ ఫ్యాన్ ఏర్పాటు చేసి, ముందు వైపు కూలర్‌కు (cooler) ముందు వైపు ఉన్నట్లుగా కాటన్‌ను కూడా ఏర్పాటు చేశాడు.

Viral video: ఎలుగుబంటితో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది మరి.. ఈ పులికి ఎలాంటి షాక్ ఇచ్చిందంటే..


ఇలా ఫైనల్‌గా చూస్తే ఇంట్లో ఓ పెద్ద కూలర్‌నే నిర్మించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడి ఐడియా మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇంటినే ఏసీగా మార్చాడుగా’’.. అంటూ మరికొందరు, ‘‘ఇటుకలకు పెట్టే డబ్బులకు కూలర్ కొనచ్చుగా’’.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: మెటల్ డిటెక్టర్ పదే పదే సౌండ్ చేస్తుండడంతో మట్టిలో తవ్వాడు.. చివరకు లోపల చూడగా..

Updated Date - May 07 , 2024 | 07:11 PM