Viral video: అయ్య బాబోయ్..! అతి పెద్ద అనకొండతో ఈత కొట్టాడు.. సమీపానికి వెళ్లడంతో.. చివరికి..
ABN , Publish Date - May 06 , 2024 | 07:30 PM
కొందరు పర్యాటకులు నదిలో ఈత కొడుతుండగా అతి పెద్ద కొండచిలువ అటుగా వచ్చింది. దీంతో వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఆ కొండచిలువ వారి సమీపానికి వచ్చినా కూడా..
అనకొండ సినిమాలో అతి పెద్ద కొండచిలువ ఎంత బీభత్సం సృష్టించిందో అంతా చూశాం. అలాంటి అనకొండలు నిజంగా ఉన్నాయా.. అనే అనుమానం ఆ సినిమా చూసిన వారికి కలుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఎక్కడెక్కడో చోటుచేసుకునే షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఓ భారీ అనకొండకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింటల్లో తెగ వైరల్ అవుతోంది. కొందరు భారీ అనకొండతో కలిసి ఈత కొట్టారు. చివరకు ఏం జరిగిందో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. బ్రెజిల్‌లోని (Brazil) పంటనాల్ వెట్‌ల్యాండ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కొందరు పర్యాటకులు నదిలో ఈత కొడుతుండగా అతి పెద్ద కొండచిలువ (largest python) అటుగా వచ్చింది. దీంతో వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఆ కొండచిలువ వారి సమీపానికి వచ్చినా కూడా వారికి ఎలాంటి హానీ చేయలేదు. వారి పక్క నుంచే తాపీగా నది ఒడ్డకు వెళ్లిపోయింది. అయితే తీక్షణంగా పరిశీలిస్తే.. అప్పటికే ఆ పెద్ద అనకొండ ఏదో జంతువును మింగేసినట్లుగా కనిపించింది. దాని కడుపు చాలా ఉబ్బెత్తుగా ఉండడంతో అది వారిని చూసినా పట్టించుకోకుండా వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది.
Viral video: టీ తాగడం మరీ ఇంత కష్టమా.. వీళ్లు పడ్డ శ్రమ చూస్తే అవాక్కవ్వాల్సిందే..
అనకొండ ఏమీ చేయకపోవడంతో ఈత కొడుతున్న వారు అనకొండ సమీపానికి వెళ్లి వీడియోలు తీసుకున్నారు. చూస్తుండగానే ఆ అనకొండ వారి పక్క నుంచి ఈత కొడుతూ నది ఒడ్డున ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘దాని కడుపు ఫుల్‌గా ఉండడంతో బతికిపోయారు’’.., ‘‘అది అల్రెడీ భోజనం చేసింది’’.., ‘‘చిన్నప్పుడు చూసిన అనకొండ సినిమా కళ్లముందు కనిపిస్తోంది’’.., ‘‘మీ టైం చాలా బాగుంది బ్రదర్’’.., ‘‘ఇలాంటి సాహసాలు చాలా ప్రమాదం’’.. అంటూ ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Viral video: వామ్మో..! ఇదెలా సాధ్యం.. కారులోకి దూరిన ఒంటె.. ఇలా బయటికొచ్చిందేంటీ..