Share News

Viral: సుద్దపూసలా గుడిలోకి వచ్చి.. శివలింగానికి భక్తిశ్రద్ధలతో మొక్కి.. ఆపై ఊహించని విధంగా..

ABN , Publish Date - Mar 14 , 2024 | 06:34 PM

మహాభక్తుడిలా గుడిలోకి ఎంట్రీ ఇచ్చి శివలింగానికి ఉన్న నాగాభరణాన్ని తస్కరించిన ఓ దొంగ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Viral: సుద్దపూసలా గుడిలోకి వచ్చి.. శివలింగానికి భక్తిశ్రద్ధలతో మొక్కి.. ఆపై ఊహించని విధంగా..

ఇంటర్నెట్ డెస్క్: మహాభక్తుడిలా బిల్డప్ ఇస్తూ ఓ వ్యక్తి గుడిలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఏమీ ఎరగనట్టు గర్భగుడిలో కాలుపెట్టాడు. అక్కడున్న శివలింగానికి భక్తి శ్రద్ధలతో నమస్కరించాడు. ఆ తరువాత ఊహించని విధంగా తన పని కానిచ్చేసి అక్కడి నుంచి జారుకున్నాడు. అతడి నిర్వాకం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డై సోషల్ మీడియా బాట పట్టింది. ప్రస్తుతం నెట్టింట కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌లో (UP) జరిగిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral Video) మారింది.

Viral: ఇంటర్వ్యూకు వచ్చిన యువతి కోరిక విని నోరెళ్లబెట్టిన కంపెనీ సీఈఓ!


వీడియోలో కనిపించిన దాని ప్రకారం ఓ దొంగ పక్కా ప్లాన్‌తో మీరట్‌లోని గుడిలో దొంగతనానికి పాల్పడ్డాడు. తొలుత అతడు ఏమీ తెలీనట్టు గుడిలోకి వచ్చాడు. గర్భగుడిలోకి వెళ్లి అక్కడున్న శివలింగంతో పాటు ఇతర దేవతావిగ్రహాలకు నమస్కరించారు. వెంట తెచ్చుకున్న సంచీని అక్కడే వదిలి క్షణకాలం పాటు బయటకు వచ్చాడు. గుళ్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక శివలింగానికి ఉన్న నాగాభరణాన్ని తీసి తన సంచీలో వేసుకున్నాడు. ఆ తరువాత ఏమీ ఎరగనట్టు అక్కడి నుంచి జారుకున్నాడు. ఇదంతా సీసీటీవీలో రికార్డైంది (Meerut Man Worships Shivling Before Stealing Its Snake Statue).

Gold: ఈ కారణంతో బంగారు నగలు కొంటున్నారంటే... తప్పు చేస్తున్నట్టే!


మరుసటి రోజు దైవదర్శనం కోసం వచ్చిన భక్తులు.. నాగాభరణం చోరీకి గురైందని గుర్తించి గగ్గోలు పెట్టారు. విషయం పోలీసుల దృష్టికి కూడా వెళ్లడంతో వారు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అయితే, గతంలోనూ ఇలాంటి ఘటనలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. గతేడాది మధ్యప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఛోటూ అనే యువకుడు ఏకంగా శివలింగాన్నే తస్కరించాడు. ప్రేమించిన అమ్మాయితో పెళ్లికావాలని మొక్కుకున్నా అది జరగకపోవడంతో అలకబూనిన అతడు ఈ పనిచేశాడని తేలింది. దీంతో ఈ ఘటన అప్పట్లో కలకలానికి దారి తీసింది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 14 , 2024 | 06:41 PM