Share News

Money Saving Tips: ఇలా చేస్తే చాలా డబ్బును సేవ్ చేసుకోవచ్చు..

ABN , Publish Date - Jan 27 , 2024 | 09:09 PM

Money Saving Tips: అసలే ద్రవ్యోల్బణ కాలం.. ఏ వస్తువు ధర చూసినా ఆకాశాన్నంటుతున్నాయి. ఫలితంగా సంపాదించిన డబ్బంతా నీళ్లలా ఖర్చైపోతుంది. అందుకే.. డబ్బు సంపాదించడం కంటే.. ఆదా చేయడం నేర్చుకోవాలి. అదే అన్నింటికంటే ముఖ్యం. ప్రస్తుత కాలంలో ప్రజలు తమ సంపాదనను బట్టి ఖర్చులు పెంచుకుంటూ వెళ్తున్నారు.

 Money Saving Tips: ఇలా చేస్తే చాలా డబ్బును సేవ్ చేసుకోవచ్చు..
Money Saving Tips

Money Saving Tips: అసలే ద్రవ్యోల్బణ కాలం.. ఏ వస్తువు ధర చూసినా ఆకాశాన్నంటుతున్నాయి. ఫలితంగా సంపాదించిన డబ్బంతా నీళ్లలా ఖర్చైపోతుంది. అందుకే.. డబ్బు సంపాదించడం కంటే.. ఆదా చేయడం నేర్చుకోవాలి. అదే అన్నింటికంటే ముఖ్యం. ప్రస్తుత కాలంలో ప్రజలు తమ సంపాదనను బట్టి ఖర్చులు పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ అలవాటు కారణంగా చాలా త్వరగా జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. అంతే కాదండోయ్.. ఎప్పటికీ డబ్బును సేవ్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థికంగా పరిపుష్ఠింగా ఉండాలంటే.. సంపాదనతో పాటు.. పొదుపు కూడా చాలా ముఖ్యం. అందుకే.. పెద్దలు ఖర్చు చేయడం కాదు.. పొదుపు చేసి చూపించు అని అంటారు. పొదుపు చేయడం ద్వారా భవిష్యత్ మెరుగుపడటమే కాకుండా.. అన్నిరకాలుగా భరోసా ఉంటుంది. అయితే, సంపాదించిన డబ్బును పొదుపు చేయాలంటే జీవితంలో కొన్ని విషయాలను తప్పనిసరిగా పాటించాలి. వాటిని పాటించడం ద్వారా డబ్బు వృథా అవకుండా ఉంటుంది. మరి ఆ టిప్స్ ఏంటో ఓసారి చూద్దాం..

పొదుపు..

జీవితంలో పొదుపు అనేది చాలా ముఖ్యం. పొదుపు అలవాటు చేసుకోవడం వలన తక్కువ సమయంలోనే మంచి మొత్తంలో డబ్బును కూడబెట్టుకోగలుగుతారు. పొదుపు డబ్బును సరైన చోట ఉపయోగించడం కూడా చాలా ముఖ్యం. సరైన చోట పెట్టుబడి పెడితే.. దాని నుంచి రాబడిని కూడా పొందవచ్చు. ఈ విధంగా పొదుపు చేయడం ద్వారా ఎక్స్‌ట్రా ఆదాయాన్ని సముపార్జించవచ్చు.

డబ్బు వృధా చేయొద్దు..

డబ్బు పొదుపు చేయాలంటే.. ముందుగా మీరు అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవాలి. ఇందుకోసం నెలవారీ బడ్జెట్‌ను నిర్ణయించుకోవాలి. దానికి అనుగుణంగా డబ్బు ఖర్చు చేస్తే ఎంత డబ్బు ఖర్చు చేశారో ఏయే ఖర్చులు ఆపాలో తెలిసిపోతుంది. నెలవారీ ఖర్చులను నిర్వహించడానికి, పొదుపు చేయడానికి ఇది సరైన, సుభమైన మార్గం.

అనవసరంగా షాపింగ్ వొద్దు..

కొందరు చీటికిమాటికి షాపింగ్ చేస్తుంటారు. అనవసర కొనుగోళ్లు చేస్తారు. కానీ, ఎప్పుడూ అలా చేయకండి. మీ సంపాదన, ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే కొనుగోలు చేయాలి. అవసరమైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలి. స్మార్ట్ షాపింగ్ చేస్తే లాభం ఉంటుంది. ఇందుకోసం ముందుగా మీరు కొనుగోలు చేయాల్సిన వస్తువుల జాబితాను సిద్ధం చేసుకోవాలి. ఆ తరువాత షాపింగ్‌కు వెళ్లి.. మీరు ముందుగా తయారు చేసుకున్న లిస్ట్ ప్రకారమే వస్తువులను కొనుగోలు చేయాలి. ఇలా చేస్తే ఎక్స్‌ట్రాన్ కొనుగోలు చేయకుండా ఉంటారు. ఇంకా విశేషం ఏంటంటే.. కొన్ని వస్తువులు ఆన్‌లైన్‌లో తక్కువ ధరకే లభిస్తాయి. అందుకే.. ఒకటి రెండు చోట్ల ధరలను చెక్ చేసిన తరువాత ఎక్కడ తక్కువ ధరకు లభిస్తే.. అక్కడ కొనుగోలు చేయాలి.

ఆన్‌లైన్ షాపింగ్ విషయంలో జాగ్రత్త..

ప్రస్తుత కాలంలో ప్రజలు బయట మార్కెట్‌కు వెళ్లడం దాదాపు తగ్గించారు. ఎవరో కొందరు మాత్రమే బయట మార్కెట్‌కు వెళ్లి షాపింగ్స్ చేస్తున్నారు. దాదాపు జనాలు ఆన్‌లైన్ షాపింగ్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. అరచేతిలో ఇమిడే ఫోన్‌లోనే తమకు కావాల్సిన అన్ని వస్తువులను కొనుగోలు చేసేస్తున్నారు. ఇందుకు కారణం ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్ భారీగా డిస్కౌంట్స్ ఇస్తూ ఆకర్షిస్తుంటాయి. ఈ కారణంగా ప్రజలు ఆన్‌లైన్ షాపింగ్‌కు అట్రాక్ట్ అవుతుంటారు. డిస్కౌంట్స్‌ చూసి తమకు అవసరం లేకున్నా అన్ని వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. తద్వారా మనీ లాస్ అవుతారు. అందుకే.. ఆన్‌లైన్ షాపింగ్ చేసే ముందు నియంత్రణ చాలా అవసరం. ఇలా చేస్తే.. డబ్బును ఆదా చేసుకోవచ్చు.

Updated Date - Jan 27 , 2024 | 09:09 PM