Viral Video: వివాహాల్లో భోజనాల వద్ద.. ఇలాంటి ఏర్పాట్లు ఎప్పుడైనా చూశారా.. ఐడియా అదుర్స్ అంటున్న నెటిజన్లు..
ABN , Publish Date - Apr 03 , 2024 | 02:57 PM
ప్రస్తుత సమాజంలో చాలా మంది వివాహాల నిర్వహణ విషయంలో ఖర్చుకు వెనుకాడడం లేదు. సమాన్య ప్రజలు కూడా.. అందరిలో గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో తమ స్థాయి మించి ఖర్చు పెడుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది...
ప్రస్తుత సమాజంలో చాలా మంది వివాహాల నిర్వహణ విషయంలో ఖర్చుకు వెనుకాడడం లేదు. సమాన్య ప్రజలు కూడా.. అందరిలో గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో తమ స్థాయి మించి ఖర్చు పెడుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది నీరు, ఆహారం తదితరాలను వృథా చేయడం చూస్తూ ఉంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, వైరల్ అవుతున్న వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓ వివాహ కార్యక్రమంలో భోజనాల దగ్గర చేసిన ఏర్పాట్లు చూసి అంతా అభినందిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వివాహ కార్యక్రమాల్లో (Wedding events) చాలా మంది భోజనాల విషయంలో ఖర్చుకు వెనుకాడకుండా అనేక వెరైటీలను సిద్ధం చేస్తుంటారు. ఈ క్రమంలో ఆహారం (Food) వృథా కూడా ఎక్కువగా జరుగుతుంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఓ వివాహ కార్యక్రమంలో నిర్వాహకులు వినూత్నంగా ఆలోచించారు. భోజనాలు చేసిన వారు ప్లేట్లు పడేసే స్థలంలో ఓ టేబుల్ ఏర్పాటు చేశారు. దానిపై అన్నం, స్వీట్లు, కూరలు ఇలా అన్నింటికీ ప్రత్యేకంగా ఖాళీ డబ్బాలను ఉంచారు. ప్లేట్లు పడేసే వారిని అడ్డుకుంటూ పక్కకు పంపిస్తున్నారు.
Viral Video: క్లాస్‌రూమ్‌లో షాకింగ్ సీన్.. మొత్తానికి ఈ అమ్మాయి భలె తప్పించుకుందిగా..
అక్కడికి వెళ్లగానే అన్నం, కూరలు, స్వీట్లు.. ఇలా అన్నింటినీ వేర్వేరుగా డబ్బాల్లో వేయిస్తున్నారు. తర్వాత వారికి పూలు అందించి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇలా భోజనం వృథా కాకుండా వారు చేసిన ఏర్పాట్లు చూసి అంతా అభినందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇది చాలా మంచి ఆలోచన’’.. అంటూ కొందరు, ‘‘ధనవంతులు వీరిని చూసి ఎంతో నేర్చుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4.50లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.