Viral Video: ఏనుగుకు ఆకలేస్తే ఇలాగే ఉంటుంది మరి.. బియ్యం గోడౌన్ వద్దకు వెళ్లి ఏకంగా..
ABN , Publish Date - Apr 02 , 2024 | 03:20 PM
జంతువులకు ఆకలి వేసిన సందర్భాల్లో సాధారణంగా వేటాడడమో, లేక అందుబాటులో ఉన్న ఆహారంతో ఆకలి తీర్చుకోవడమో చేస్తుంటాయి. అయితే కొన్నిసార్లు వాటికీ ఆకలితిప్పలు ఎదురవుతుంటాయి. అలాంటి సందర్భాల్లో ఆకలి తీర్చుకునేందుకు కొన్నిసార్లు అవి బీభత్సం సృష్టిస్తుంటాయి. ఇలాంటి..
జంతువులకు ఆకలి వేసిన సందర్భాల్లో సాధారణంగా వేటాడడమో, లేక అందుబాటులో ఉన్న ఆహారంతో ఆకలి తీర్చుకోవడమో చేస్తుంటాయి. అయితే కొన్నిసార్లు వాటికీ ఆకలితిప్పలు ఎదురవుతుంటాయి. అలాంటి సందర్భాల్లో ఆకలి తీర్చుకునేందుకు కొన్నిసార్లు అవి బీభత్సం సృష్టిస్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ ఏనుగుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆకలి వేసిన ఏనుగు బియ్యం గోడౌన్ షట్టర్‌ను ధ్వంసం చేయడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కేరళ-కర్ణాటక సరిహద్దుల్లోని (Kerala-Karnataka border) గుండ్లుపేట్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్రమైన ఆకలితో ఉన్న ఏనుగు.. ఆహారం కోసం ఎంతో ప్రయత్నించింది. అయినా దానికి అక్కడా ఎలాంటి ఆహారం కనిపించలేదు. దీంతో అటూ ఇటూ తిరిగి సమీపంలోని జనావాల్లోకి చొరబడింది. ఆవేశంగా వస్తున్న ఏనుగును చూసి స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఎలాగైనా ఆకలి తీర్చుకోవాలనే ఉద్దేశంతో స్థానికంగా ఉన్న ఓ పెద్ద గోడౌన్ (Rice godown) వద్దకు వెళ్లింది. అయితే అక్కడ దానికి ఎలాంటి ఆహారం కనిపించలేదు. గోడౌన్ షట్టర్లన్నీ మూసి ఉండడం చూసి దానికి మరింత కోపం వచ్చింది. లాక్ చేసిన ఉన్న షట్టర్ వద్దకు వెళ్లిన ఏనుగు.. తొండంతో ఒక్క దెబ్బ వేసింది. అంతే, దాని దెబ్బకు ఇనుప షట్టర్ కూడా కుప్పకూలిపోయింది.
Viral Video: షాపింగ్ మాల్‌లో షాకింగ్ సీన్.. యువతి దుస్తులు తీసుకుంటుండగా.. ఉన్నట్టుండి..
షట్టర్‌ను కిందకు తొక్కేసిన ఏనుగు (elephant breaks godown shutter) తొండాన్ని లోపలికి పెట్టి.. బియ్యం మూటను బయటికి లాగింది. దాన్ని పక్కకు తీసుకెళ్లి.. కాలితో ఒక్క తన్ను తన్నింది. దీంతో మూట మొత్తం ఓపెన్ అయింది. తర్వాత తాపీగా బియ్యాన్ని భోంచేసింది. ఇలా ఏనుగు తన ఆకలిని తీర్చేసుకుని వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో..! ఈ ఏనుగుకు ఎంత కష్టం వచ్చింది’’.. అంటూ కొందరు, ‘‘అడవులను నరికేయడం వల్లే ఇలా జరుగుతోంది’’.. అంటూ మరికొందరు, ‘‘వణ్యప్రాణులను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.30లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.